రాజమౌళితో కానిది.. ఎన్టీఆర్ చేశాడు.. నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ చిత్రం తర్వాత నుంచి హీరోగా పలు చిత్రాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. 2006 నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న ఆయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే వస్తున్నారు. అయితే నవీన్ చంద్ర కొన్నాళ్లుగా హీరోగా కాకుండా ప్రత్యేక పాత్రల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. హీరోగా బడా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో నటించినప్పటికీ ఆ తర్వాత పెద్దగా షైన్ కాలేకపోయారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చిత్రంతో ఆయన కెరీర్ మలుపు తిరిగిందని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

నవీన్ చంద్ర వివరాలు..
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నవీన్ చంద్ర 2006లో తొలిసారిగా వెండితెరపై మెరిశారు. శంభావామి యుగే యుగే అనే చిత్రంలో అంజి అనే పాత్రలో నటించి ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత కళ్యాణం, తమిళంలో పజ్హానియప్ప కల్లూరి అనే చిత్రంలోనూ సపోర్టింగ్ రోల్ లో నటించారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలో ఆర్టిస్ట్ గా తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన నటనకు యూత్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.

Actor Naveen Chandra about his Career Turning point with NTR Movie

నవీన్ చంద్ర సినిమాలు..
అందాల రాక్షసి చిత్రం తర్వాత నవీన్ చంద్ర కొన్ని గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు. దళం, నా రాకుమారుడు, భం భోలేనాథ్, త్రిపుర, లచ్చిందేవికి ఓ లెక్కుంది, మీలో ఎవరు కోటీశ్వరుడు, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, భానుమితి & రామకృష్ణ, మిస్ ఇండియా, సూపర్ ఓవర్, #బ్రో, అమ్ము, తగ్గెదేలే, రిపీట్, మంథ్ ఆఫ్ మధు, 28 డిగ్రీల సెల్సియస్, ఎలెవన్ వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. ఇప్పటికీ హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాతో కెరీర్ మలుపు..
నవీన్ చంద్ర హీరోగా నటించిన పాత్రల కంటే సపోర్టింగ్ రోల్స్ లో నటించిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత వీర రాఘవ, ఎవరు, పటాస్, అర్ధ శతాబ్ధం, గని, విరాట పర్వం, వీర సింహారెడ్డి, సత్యభామ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. అయితే వీటన్నింటిలో నవీన్ చంద్ర కెరీయర్ ను మలుపు తిప్పింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవలో పోషించిన బాలా రెడ్డి పాత్ర అని చెప్పారు.

రాజమౌళి అందాల రాక్షసితో హీరోగా పేరు వచ్చినా.. జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన బాలా రెడ్డి పాత్రతో తన కెరీయర్ టర్న్ తిరిగిందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కెరీయర్ బిగినింగ్ లో ఎన్నో పాట్లు పడ్డందుకు తొలుత రాజమౌళి ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యి.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మంచి నటుడిగా క్రేజ్ దక్కిందని చెప్పారు. ముఖ్యంగా అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ గారు తన గురించి మాట్లాడిన ప్రత్యేక మాటలు కెరీయర్ ను మార్చేశాయని చెప్పారు. ఆ తర్వాత నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X