Karthikeya 2: ఇవి కనిపెడితే ఆరు లక్షలు మీవే.. టీమ్ ఆసక్తికర ప్రకటన!
గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఎట్టకేలకు కి అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే స్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన తాజాగా కార్తికేయ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసుందుకు సిద్ధం అవుతోంది. అయితే ఆ సినిమా యూనిట్ తాజాగా ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

కార్తికేయ 2
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'హ్యాపీడేస్' చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యాడు నిఖిల్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైనా తర్వాత వరుస పరాజయాలు చవిచూశాడు. స్వామి రారా సినిమాతో ఆయన అతని కెరీర్ మరోసారి మలుపు తిరిగింది. ఆ తరువాత కార్తికేయ, ఎక్కడికి పోతావ్ చిన్నవాడ, అర్జున్ సురవరం వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఆసక్తికర ప్రకటన
డైరెక్టర్ చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇక మొదటి భాగంలో నిఖిల్ జతగా రీతూ వర్మ నటించగా ఈ రెండో భాగం సినిమాలో నిఖిల్‌కు జోడీగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. 'కార్తికేయ 2 నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సినిమా యూనిట్ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది.

హింట్స్ ఏంటో
నాలుగు సిటీలలో సినిమా యూనిట్ బంగారంతో చేసిన కృష్ణ విగ్రహాన్ని దాస్తున్నారని, దానిని ఎవరైనా కనిపెడితే అక్షరాలా 6 లక్షల విలువైన ఆ గోల్డెన్ ఐడల్ మీ సొంతం అని ఒక క్రేజీ ఆఫర్ ని ప్రకటించారు. అంతేకాక వీటిపై తాము కొన్ని హింట్స్ కూడా ఇస్తామని ఫస్ట్ హింట్ మరికొన్ని గంటల్లో అందించనున్నామని హీరో నిఖిల్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఆడియెన్స్ కి ఒక ఆసక్తికి కలిగించే ప్రమోషన్ అనే చెప్పాలి. వారు ఇచ్చే హింట్స్ ఏంటో నిజంగానే ఇవి ఎవరైనా గెలుచుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది.

అనుపమ్ ఖేర్
ఇక కార్తికేయ 2 సినిమాలో కార్తికేయగా నిఖిల్, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారని ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఇక ధన్వంతరి అనే పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా శాంతను అనే పాత్రలో ఆదిత్య మీనన్ నటిస్తున్నారు.

ఆగస్టు 12వ తేదీన
శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఎ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ బాషలలో థియేటర్లలో విడుదల కానుంది. ఆ తరువాత తమిళ్ వర్షన్ ఓటీటీలో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











