అయ్యో పాపం... నిఖిల్ చివరకు ‘టైటిల్’ మార్చుకుంటున్నాడా?
'ముద్ర' అనే పేరు వినగానే... ఇది టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా అని ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. 'ముద్ర' పేరుతో నిఖిల్ నటిస్తున్న చిత్రం పోస్టర్లు గతంలో రిలీజ్ కావడమే ఇందుకు కారణం. అయితే ఇటీవల ఇదే టైటిల్‌తో మరో మూవీ రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఈ విషయంలో నిఖిల్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. చివరకు ఇది నట్టి కుమార్ (ఇటీవల 'ముద్ర' సినిమా రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్), నిఖిల్ మధ్య గొడవకు దారి తీసింది. తన సినిమా పేరుతో మరో సినిమా ఎలా రిలీజ్ చేస్తారంటూ నిఖిల్ ప్రశ్నించడం, ఆ టైటిల్ తనదే అని నట్టి కుమార్ వాదించుకోవడం తెలిసిందే.

అయితే తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... చివరకు నిఖిల్ నటిస్తున్న 'ముద్ర' చిత్ర బృందం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న వారు తమ సినిమా టైటిల్ మార్చి కొత్త పోస్టర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 12 గంటలకు దీన్ని రిలీజ్ చేయబోతున్నట్లు టాక్.
ఈ చిత్రానికి తమిళ ఫిల్మ్ మేకర్ టిఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నిఖిల్ అర్జున్ లెనిన్ సురవరం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కనిపించబోతున్నారట. లావణ్య త్రిపాఠి హీరోయిన్. బి మధు సమర్పణలో కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











