హీరో నితిన్ ఖాతాలో 400 మిలియన్లు.. యువ హీరో ఫాలోయింగ్ మాములుగా లేదుగా
దక్షిణాదిలో అగ్రగామి మ్యూజిక్ కంపెనీగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఇటీవలే సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. యూట్యూబ్ ఛానల్‌లో ఆదిత్య మూవీస్ అకౌంట్‌పే ఓపెన్ చేసి తెలుగు హీరోల, హిందీ డబ్బింగ్ సినిమాలను అప్‌లోడ్ చేస్తూ భారీగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఈ మధ్య ఆదిత్య మూవీస్ ఛానెల్‌లో ప్రసారమైన చిత్రాలకు.. ముఖ్యంగా నితిన్ సినిమాలకు భారీ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా హీరో నితిన్ నటించిన సూపర్ హిట్ సినిమాలు అఆ, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్ వెర్షన్ కు ఓవర్ ఆల్ గా 400 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన అఆ మూవీకి 180 మిలియన్లకిపైగా వ్యూస్, అ ఆ 2 (ఛల్ మోహన్ రంగ హిందీ వెర్షన్) కు 112 మిలియన్ల వ్యూస్, శ్రీనివాస కళ్యాణం సినిమాకు 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నితిన్ నటించిన ఈ మూడు సినిమాలుకి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్ ఆదిత్య మూవీస్ తోనే ఉన్నాయి. అలానే ఈ మూడు సినిమాలు నితిన్ కెరీర్‌లో వరుసగా రిలీజ్ అవ్వడం విశేషం.

ఈ సందర్భంగా సంస్ధ మేనెజింగ్ డైరెక్టర్ ఉమేశ్ గుప్త మాట్లాడుతూ, మా ఆదిత్య మూవీస్ ఛానల్‌ని విశేషంగా ఆదరిస్తున్న వ్యూయర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్రివిక్రమ్ గారు డైరెక్షన్‌లో నితిన్ హీరోగా వచ్చిన అ ఆ సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేయడంతోనే మా ఆదిత్య మూవీస్ మొదలైంది.
సాధారణంగా యాక్షన్ మూవీస్ ఇష్టపడే నార్త్ ఆడియన్స్, అ ఆ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను విశేషంగా ఆదరించారు. అనూహ్యంగా అ ఆ తరువాత కూడా నితిన్ నుంచి వచ్చిన చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలకి భారీగా స్పందన లభించడం విశేషం అని తెలిపారు.
నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన నటించిన సినిమాల్లో దాదాపు 19 సినిమాలు ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారానే రిలీజ్ చేయడం జరిగిందని, వాటిలో జయం, దిల్, సై, ఇష్క్, అ ఆ, భీష్మ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయని , ఇన్నేళ్లుగా మా సంస్థపై నమ్మకం ఉంచుతూ వస్తున్న నితిన్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.
డైరెక్టర్ ఆదిత్య గుప్త మాట్లాడుతూ మమల్ని ఆదిరిస్తున్న అన్ని వర్గాల ప్రేక్షకులకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. అలానే మమల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన హీరో నితిన్ గారికి, దర్శక నిర్మాతలకు నా అభినందనలు, ధన్యవాదాలు అని అన్నారు.


Click it and Unblock the Notifications











