twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిఖిల్ తరహాలనే నితిన్ వెడ్డింగ్ ప్లాన్.. లేటయితే చాలా కష్టమని..?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ముచ్చట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోలో లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టాల్సిన సమయం వచ్చేసిందని మూడు పదుల వయసు దాటిన హీరోలు పెళ్లి వార్తలతో జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇటీవల నిఖిల్ హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే రానా కూడా పెళ్లి పనులు మొదలెట్టేశాడు. ఇక నెక్స్ట్ నితిన్ కూడా ఆగిపోయిన పనులను కంటిన్యూ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

     దిల్ రాజు కూడా..

    దిల్ రాజు కూడా..

    నిర్మాత దిల్ రాజు కూడా హడావుడి లేకుండా కేవలం కొద్దీ మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం చేసుకున్నాడు. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారనే వార్తలు వచ్చినప్పటికీ ఆ విషయంలో క్లారిటీ రాలేదు. లాక్ డౌన్ లో ఎవరు ఊహించని విధంగా దిల్ రాజు న్యూ లైఫ్ స్టార్ట్ చేశాడు. దిల్ రాజు పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

    నిఖిల్ స్పెషల్ వెడ్డింగ్..

    నిఖిల్ స్పెషల్ వెడ్డింగ్..

    ఈ ఏడాది సమ్మర్ లోనే పెళ్లి చేసుకోవాలని నిఖిల్ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. కరోనా వచ్చినా పెళ్లి పనులను ఆపలేనని గుడిలో దండాలు మార్చుకొనైనా పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పాడు. మొత్తానికి అన్నటుగానే కొద్దీ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో రూల్స్ ప్రకారం వివాహం చేసుకున్నాడు నిఖిల్. కరోనా కారణంగా స్పెషల్ కేర్ తీసుకొని మరి పెళ్లి చేసుకున్నాడు.

    నితిన్ కూడా అదే భాటలో..

    నితిన్ కూడా అదే భాటలో..

    ఇక ప్రస్తుతం నితిన్ కూడా నిఖిల్ తరహాలోనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. అసలైతే ఏప్రిల్ 16న దుబాయ్ లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న నితిన్ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశాడు. కానీ ప్రస్తుత పరిస్థితులులను చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా వైరస్ జోరు తగ్గేలా కనిపించడం లేదు.

    అందుకే పెళ్లి..

    అందుకే పెళ్లి..

    కరోనా వైరస్ దేశం మొత్తంలో లక్ష పాజిటివ్ కేసులతో దూసుకుపోతోంది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో పెళ్లి చేసుకోవాల్సిన వారు సైలెంట్ గా పనులను పూర్తి చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కరోనా ఇంకా ఎంతగా బయపెడుతుందో తెలియదు. అందుకే ఇప్పుడే నితిన్ కూడా పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Looks like a special bridal art in Tollywood. Within a few days, four celebrities have become a hot topic in the media with wedding themes. Mind has become a block to many for Rana's blow. All this time the fear of Baahubali villain who now fears marriage is also at stake. Nithiin and Nikhil are also preparing to tie the knot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X