దొంగల చేతికే తాళాలు.. సీసీ కెమెరాల ఆధారాలు.. ‘చిత్రపురి’ స్కాంపై నటుడు కల్యాణ్ తీవ్ర ఆరోపణలు
సినీ కార్మికుల సంక్షేమం కోసం నిర్మించిన చిత్రపురి కాలనీ హౌసింగ్ సోసైటీలో డిసెంబర్ నెల 10న జరిగే ఎన్నికల నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. ప్రధాన వర్గాలు, సినీ ప్రముఖులతో కూడిన రెండు ప్యానెల్స్ సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా కత్తుల దూసుకొంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు ఓ కళ్యాణ్ తన ప్యానల్ సభ్యులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ కావూరి, ఈశ్వర ప్రసాద్ మీసాల, కస్తూరి శ్రీనివాస్, బి నరసింహ రెడ్డి, పసునూరి శ్రీనివాసులు, మన్యవాసి వై వి, శ్రీనివాస కూనపరెడ్డి, ఆత్మకూరు రాధా, మల్లికా టి, మధు జాటోత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు. కొందరు సభ్యుల హయాంలో 300 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత కార్యవర్గానికి సంబంధించిన గడువు అక్టోబర్ 25తో ముగిసింది. కానీ వాళ్లంతా అక్కడే ఉంటూ హోసింగ్ సొసైటిని మోసం చేసి మేనేజ్ చేసుకున్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు పర్సనల్ ఇంచార్జ్ కమిటీ (pic) కి ఇంచార్జ్‌గా చేసారు. కమిటీ వీళ్లపై ఎంక్వయిరీ వేయగానే .. వినోద్ బాల దాన్ని ఆపడానికి కోర్టులో ఛాలెంజ్ చేసాడు. మా పై కమిటీ వద్దండి అంటూ .. ? అలాగే కాంట్రాక్టర్ దగ్గర 6 కోట్ల రూపాయలు స్కాం చేసినట్టు సిసి కెమెరాల ఆధారాలు ఉన్నాయి.,

పార్క్ హయత్ హోటల్‌లో కాంట్రాక్టర్ వద్ద ఈ 11 మంది గ్యాంగ్ డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. దర్శకుడు కృష్ణమోహన్ రెడ్డి కృష్ణానగర్ నుంచి ఆటోలో వచ్చి నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి ఇప్పుడు అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. డుప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు .. లక్షలకు లక్షలు వడ్డీలకు ఇస్తున్నాడు. ఈ సొమ్మంతా ఎవరిదీ అంటూ కల్యాణ్ ప్రశ్నించాడు. ఇలాంటి అక్రమాలపై మేము పోరాటం చేస్తున్నాం అని కల్యాణ్ ఆరోపణలు చేశాడు.

ఇలాంటి విషయంలో నిర్మాత సి కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. అయన పెద్ద మనిషి అని అయన ద్వారా ఈ సమస్యలు సాల్వ్ చేయాలనీ, ఆయనను ప్రసిడెంట్ చేయాలనీ అనుకుంటే .. అయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మారెడ్డి భరద్వాజను ప్యానల్ లో పెట్టుకున్నాడు. దీంతో ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. మళ్లీ ఇప్పుడు 350 ఎకరాలు సినీ కార్మికులకు ఇల్లు వచ్చేలా ఏర్పాటు చేస్తాం. సీనియారిటీ ప్రకారం ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ జెస్టిస్ ఫిలిం ఇండస్ట్రీ, ఇన్ జస్టిస్ చిత్రపురి కాలనీ, తప్పకుండా ఈ స్కామ్‌లో ప్రతి ఒక్కరు దొరుకుతారు .. అందరు జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు.


Click it and Unblock the Notifications