తప్పును సరిద్దిద్దుకొంటా.. ఆయనంటే గౌరవం.. ఎంపీపై వివాద వ్యాఖ్యలపై పోసాని

సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో ఎంపీ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకొంటున్న పరిస్థితులపై ప్రత్యేకంగా ఆదివారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సినీ, రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మీడియాలో వివాదంగా మారింది. ఈ క్రమంలో ఆయన వివరణ ఇస్తూ..

యూట్యూబ్, సోషల్ మీడియాలో

యూట్యూబ్, సోషల్ మీడియాలో

పోసాని మురళీ కృష్ణ తన ప్రకటనలో ఈ వివాదంపై స్పందిస్తూ.. గత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌లో ఎంపీ రేవంత్‌ రెడ్డి వ్వక్తిగతంగా, రాజకీయంగా విమర్శించానని, అలాగే ఘాటు వ్యాఖ్యలు చేసానని వార్తలు వచ్చాయి. .అలాగే రేవంత్‌ రెడ్డిపై పోసాని ఫైర్‌, రేవంత్ రెడ్డిపై పోసాని ఘాటు కామెంట్స్‌ అని సోషల్‌ మీడియాలోనూ, యూట్యూబ్‌ చానల్స్‌లోనూ విపరీతంగా ట్రోల్‌ అవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి నేను ఎంతో భాదపడ్డాను అని తెలిపారు.

ఆయనను ఎప్పుడూ కామెంట్ చేయలేదు

ఆయనను ఎప్పుడూ కామెంట్ చేయలేదు

అలాగే మల్కాజి గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్‌ రెడ్డి, ఆయన సన్నిహితులు, ఆయన అభిమానులు మనస్తాపం చెందారని తెలిసింది. నాకు తెలిసో, తెలియకో నా జీవితంలో ఆయనను వ్వక్తిగతంగా గానీ , రాజకీయ పరంగా కానీ ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు. మొన్న జరిగిన ప్రెస్‌ మీట్‌లో కూడా నేను తప్పుగా మాట్లడలేదు.. ఎప్పుడైనా ప్రెస్‌మీట్‌లో ప్రతిపక్షం విమర్శ చేసేటప్పుడు, విమర్శతోపాటు సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుందని అన్నానని పోసాని అభిప్రాయపడ్డారు.

తప్పుగా మాట్లాడలేదు

తప్పుగా మాట్లాడలేదు

ఎవరైనా సాక్ష్యాలు చూపించి విమర్శలు చేస్తే జనం కూడా నమ్ముతారు. జనం గుండెల్లోకి కూడా మీ వార్త చేరుతుంది. అలా అయితే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మాట్లాడానే తప్ప.. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఈ విషయంలో ఏదో పొరపాటు జరిగింది. తప్పుగా నా వ్యాఖ్యలు ప్రజెంట్ అయ్యాయని భావిస్తున్నాను అని పోసాని చెప్పారు.

Recommended Video

Posani Krishna Murali Comments On Tollywood Film Industry
రేవంత్ రెడ్డి అంటే గౌరవం

రేవంత్ రెడ్డి అంటే గౌరవం

నా ప్రెస్‌ మీట్‌లో ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి గురించి నేను అసలు మాట్లాడలేదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అయినా సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఛానల్స్‌లో బాగా ట్రోల్‌ అవుతున్నాయి. కాబట్టి ఇది నా బాధ్యతగా తీసుకొని రేవంత్‌ రెడ్డికి , ఆయన అభిమానులకు విచారం వ్వక్తం చేస్తున్నాను. ఇది నా తప్పుగానే భావించి, ఈ తప్పును సరిదిద్దుకొంటాను అని పోసాని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X