పోసాని కృష్ణమురళి, ఆయన కుటుంబానికి కరోనా పాజిటివ్.. దర్శక, నిర్మాతలు క్షమించండి అంటూ లేఖ
కోవిడ్ 19 థర్డ్ వేవ్ మొదలైందనే భయాందోళనల మధ్య నటుడు పోసాని కృష్ణమురళి కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల రోగ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ అనిత తేలింది. ప్రస్తుత పోసాని కుటుంబ సభ్యులందరూ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు.

పోసాని మీడియాకు ప్రకటనను రిలీజ్ చేసి.. నేను, నా కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడ్డారు. నాకు సినిమా ఆఫర్లు ఇచ్చిన నిర్మాత, దర్శకులు నన్ను క్షమించండి. నా వల్ల ఇబ్బంది జరిగితే మన్నించాలి. నాకు కరోనా రావడం వల్ల రెండు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి అని పోసాని తెలిపారు.
నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు. నేను, నా కుటుంబం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాం. మీ అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగులో పాల్గొంటాను అని పోసాని తెలిపారు. మళ్లీ షూటింగ్ లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











