ప్రభాస్ పెళ్లిపై ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ శ్రీను.. ప్రపంచం మొత్తం తెలుస్తుంది అంటూ..

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కు పెంచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు అన్ని భాషల ప్రేక్షకులకు కూడా చాలా దగ్గర అయ్యాడు. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రభాస్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇక ప్రభాస్ పెళ్లి గురించి కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ దగ్గర వర్క్ చేసే.. అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ప్రభాస్ శ్రీను కూడా రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎవరూ ఊహించని విధంగా ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

ఎలాంటి సినిమా చేసినా..

ఎలాంటి సినిమా చేసినా..

బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతాయని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సాహో సినిమా తరువాత ప్రభాస్ మరింత ఫాస్ట్ గా సినిమాలను నిలబెట్టే దిశగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా చేయని విధంగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు.

రూమర్స్ ఎన్ని వచ్చినా..

రూమర్స్ ఎన్ని వచ్చినా..

అయితే ప్రభాస్ కు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. పుట్టిన ప్రభాస్ పెళ్లి గురించి ప్రతి ఏడాది కొన్ని వందల వార్తలు వస్తున్నాయి. గతంలో కొంతమంది హీరోయిన్స్ తో కూడా ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు స్టోరీ లు అల్లెశారు. ఇక ప్రభాస్ కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం మానేశాడు.

అనుష్కతో పెళ్లి అంటూ..

అనుష్కతో పెళ్లి అంటూ..

ముఖ్యంగా అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఏస్థాయిలో వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రూమర్స్ డోస్ ఎక్కువైనా మొదట్లోనే ప్రభాస్ ఒక మంచి కామెంట్ కూడా చేశాడు. ఈ రూమర్స్ తగ్గాలంటే ముందుగా మా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని తేల్చేశాడు.

కృష్ణంరాజు అసహనం

కృష్ణంరాజు అసహనం

అయితే మధ్యలో కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి పై తరచు ప్రశ్నలు ఎదురవడంతో లైవ్ లోనే అసహనం వ్యక్తం చేశాడు. తాము పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా కూడా ప్రభాస్ వినడం లేదు అనే విధంగానే వివరణ ఇచ్చారు. ప్రభాస్ చిన్నపిల్లాడు కాదు అని అతనికి అన్ని తెలుసు అని మేము కూడా ఎంత చెప్పినా ఏం లాభమని కొంత అసంతృప్తిగానే వివరణ ఇచ్చారు.

ఇప్పట్లో పెళ్లి జరగనట్లే..

ఇప్పట్లో పెళ్లి జరగనట్లే..

ఇక ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రభాస్ మాత్రం 'సోలో లైఫ్ సో బెటర్' అనే విధంగానే ముందుకు సాగుతున్నాడు. అయితే గతంలో బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాను అని కుటుంబ సభ్యులతో చెప్పినప్పటికీ మళ్లీ ఎప్పటిలానే అంతకుమించి సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇక ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశం లేదని అందరిలో ఒక క్లారిటీ అయితే ఉంది.

Recommended Video

Prabhas ఫాన్స్ కే ఎందుకిలా ? Radhe Shyam | Bheemla Nayak | Sankranthi 2022| Filmibeat Telugu
ప్రపంచం మొత్తం తెలుస్తుంది..

ప్రపంచం మొత్తం తెలుస్తుంది..

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను కూడా ప్రభాస్ పెళ్లిపై ఒక కామెంట్ కూడా చేసాడు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకు శ్రీను ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. చాలామంది అడిగారు. అయితే నువ్వు నేను ఆ విషయం మాట్లాడుకున్నంత మాత్రాన ప్రభాస్ పెళ్లి అయిపోదని.. దేనికైనా సమయం రావాలి అని, ఆ సమయం వచ్చినప్పుడు అవుతుంది అంటూ చాలా సున్నితంగా ప్రభాస్ శ్రీను చెప్పాడు.. అంతే కాకుండా ఆయ‌న పెళ్లి చేసుకుంటే ప్ర‌పంచం మొత్తం తెలుస్తుంది.. అని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X