Chandrayaan 3 ప్రయోగంపై ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్.. ఏ మాత్రం తగ్గకుండా అలాంటి మెసేజ్!

చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడంపై ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ ముక్త కంఠంతో హర్షిస్తున్నారు. అతి తక్కువ వ్యయంతో ప్రయోగాన్ని సక్సెస్ చేసిన శాస్త్రవేత్తలు, ఇస్రో సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందు నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ అత్యంత వివాదాస్పదమైంది.

ఈ క్రమంలో చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ తర్వాత మరోసారి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడంపై మరింత ఆసక్తిని రేపింది. ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద ట్వీట్ ఏంటి? తాజాగా తన ట్వీట్‌లో ఏం మెసేజ్ పంపారు అనే విషయంలోకి వెళితే..

Actor Prakash Raj congratulated ISRO team on success of Chandrayaan 3

చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ అడుగపెడుతున్న సమయంలో ఓ కార్టూన్‌ను పోస్టు చేసి ప్రకాశ్ రాజ్ వివాదానికి తెరలేపారు. చంద్రయాన్ 3 చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఇప్పుడే ఓ ఛాయ్ అమ్ముకునే వాడి ఫోటోను పంపింది. ఆ ఫోటో ఇదే అంటూ కామెంట్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై నెటిజన్లు, హిందుత్వ వాదులు తీవ్రంగా మండిపడ్డారు.

చంద్రయాన్ 2 ప్రయోగాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రకాశ్ రాజ్‌పై కర్ణాటకలో కేసు నమోదైంది. భాగల్‌కోట్ జిల్లాలోని బానాహట్టి పోలీస్ స్టేషన్‌లో కొందరు హిందుత్వ వాదులు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రకాశ్ రాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వివాదం నేపథ్యంలో చంద్రయాన్ బుధవారం ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై అడుగుపెట్టింది.

Actor Prakash Raj congratulated ISRO team on success of Chandrayaan 3

చంద్రుడిపై అంతరిక్ష ప్రయోగం సక్సెస్ చేసిన మానవ ప్రయత్నానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇండియాకు అత్యంత గర్వకారణమైన సంఘటన. చంద్రయాన్ 3, విక్రమ్ ల్యాండర్, ఇస్రో శాస్త్రవేత్తలకు, ఈ ప్రయోగంలో భాగమైన ప్రతీ ఒక్కరికి థ్యాంక్యూ. ఈ ప్రయోగం విజయవంతం కావడం అంతరిక్ష పరిశోధనకు మరింత ఊతం ఇస్తుంది. మన మిస్టరీ యూనివర్స్‌ను చేధించినందుకు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అంటూ ప్రకాశ్ రాజ్ అభినందనలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత నటుడు ప్రకాశ్ రాజ్‌పై నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. రకరకాల ఫోటోలు, మీమ్స్, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రకాశ్ రాజ్‌పై నమోదైన కేసులో ఆయనకు ఎలాంటి పరిస్థితి ఎదురువుతుందని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X