twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maa elections 2021: మొన్న బండ్ల ఇప్పుడు పృథ్వి.. జీవితను టార్గెట్ చేస్తూ ఫిర్యాదు.. ఏమైందంటే?

    |

    టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి దిగుతున్న అభ్యర్థులు వేగం పెంచారు. అయితే ముందుగా ప్రకాష్ రాజ్ సిని'మా' బిడ్డలం అంటూ ఒక పానల్ ప్రకటించడంతో ఈ రోజు మంచు విష్ణు కూడా ముందుకు వచ్చి తన పానల్ కూడా ప్రకటించారు. అయితే ఈ రోజు మంచు విష్ణు ప్రకటించిన ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న బలిరెడ్డి పృథ్వీరాజ్ అదేనండి కమెడియన్ పృథ్వీరాజ్ జీవిత రాజశేఖర్ మీద ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అసలు ఆయన ఎందుకు ఫిర్యాదు చేశారు? అనే వివరాల్లోకి వెళితే

    జోరందుకున్న ఎన్నికలు

    జోరందుకున్న ఎన్నికలు

    గత కొద్ది రోజులుగా చర్చనీయాంశం అవుతున్న టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ప్రస్తుతానికి ముగ్గురు అభ్యర్థులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు.. ముందుగా ప్రకటించినట్లుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సి వి ఎల్ నరసింహారావు బరిలోకి దిగుతున్నారు.. ఇందులో మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ఇద్దరు ప్యానల్స్ గా ఏర్పడి పోటీ చేస్తూ ఉండగా సి వీ ఎల్ నరసింహారావు మాత్రం ఏకాకిగా రంగంలోకి దిగుతున్నారు. అయితే మేము అందరం కలిసే ఉంటాం ఎన్నికల వారికి హడావుడి ఉంటుందని చెప్పుకుంటున్నా సరే రాజకీయ నాయకులను తలపించే విధంగా ఒకరి మీద ఒకరు విమర్శల వర్షం కురిపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

    ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు

    ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు

    నిజానికి ముందు నుంచి ప్రకాష్ రాజు కి చాలా సపోర్ట్ గా నిలబడుతూ వచ్చిన బండ్ల గణేష్ సైతం జీవిత రాజశేఖర్ ఎంట్రీతో వెనక్కి తగ్గాడు. ముందు నుంచి హేమ, జీవితా రాజశేఖర్ వేరువేరుగా అధ్యక్ష పదవికి బరిలో దిగుతారని ప్రకటించారు. అందరూ అది నిజమే అని భావించారు కానీ ప్రకాష్ రాజు రంగంలోకి దిగి జీవితా రాజశేఖర్ కు జనరల్ సెక్రటరీ పదవి ఇస్తానని ఒప్పించడంతో పాటు హేమ చేత మరో కీలక పదవికి పోటీ చేయించే విధంగా ఒప్పించడంతో వాళ్ళిద్దరూ కూడా ప్రకాష్ ప్యానల్ లోనే పోటీ చేస్తున్నారు. అయితే అలా చేయడం తనకు నచ్చలేదనే ఉద్దేశంతో బండ్ల గణేష్ బయటకు రావడమే కాక జీవిత-రాజశేఖర్ పోటీ చేస్తున్న పదవికి తాను వ్యతిరేకంగా పోటీ చేస్తానని ప్రకటించాడు.

    మొన్న బండ్ల ఇప్పుడు పృథ్వి

    మొన్న బండ్ల ఇప్పుడు పృథ్వి


    ఇప్పుడు కూడా కమెడియన్ పృథ్వీరాజ్ జీవిత-రాజశేఖర్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఎన్నికల ఆఫీసర్ కు రాసిన లేఖలో జీవిత మీద చర్యలు తీసుకోవాలని పృద్విరాజ్ కోరాడు. పూర్తిగా ఇంగ్లీషులో రాసి ఉన్న ఈ లేఖ సారాంశం మీకోసం అందిస్తున్నాం. ''నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిబంధనలకు కట్టుబడి ఉంటాను కానీ ఈ మధ్య మా జనరల్ సెక్రెటరీగా పనిచేస్తున్న జీవిత గురించి, ప్రస్తుతం ఆమె చేస్తున్న కార్యకలాపాల గురించి ఇప్పుడు మీ దృష్టికి తీసుకు రావాల్సి వస్తోంది. ప్రస్తుతం జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె నిర్వహిస్తున్న పదవిని అడ్డం పెట్టుకుని ఆమె కొందరు ఇన్ఫ్లూయన్స్ చేస్తున్నారని ఆరోపించారు.

    వాడుకున్నట్లు తెలిసింది

    వాడుకున్నట్లు తెలిసింది

    ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ ని ఆమె తన ఎన్నికల క్యాంపెయిన్ కోసం వాడుకున్నట్లు తెలిసిందని టెంపరరీ ఐడి కార్డులు ఇస్తామని జీవిత కొందరిని తనకు ఓటు వేసే విధంగా మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తనకు ఓటు వేస్తే ఇలాంటి చాలా లాభాలు ఉంటాయని వాళ్ళ మనసులు ఇన్ఫ్లూయన్స్ చేస్తున్నారని అలా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని ఆయన లేఖలో కోరారు.

    Recommended Video

    Prakash Raj Speech About MaaMembers | CineMAABidalu | MaaElections
    ప్రస్తావించకపోవడం గమనార్హం

    ప్రస్తావించకపోవడం గమనార్హం

    ఎన్నికల రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని తెలిపారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లేఖను ఆయన ఈ రోజే రాయగా అందులో అయన తనను తాను మా మెంబర్ గా పేర్కొన్నాడు. తాను వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయాన్ని ఎక్కడా పృధ్వీరాజ్ ప్రస్తావించకపోవడం గమనార్హం.

    English summary
    actor prudhvi complains to maa election officer about jeevitha rajashekar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X