Vedaant Madhavan: గర్వించేలా చేస్తున్న మాధవన్ కొడుకు.. మరో అద్భుతమైన రికార్డు!

టాలెంటెడ్ నటుడు మాధవన్ భాషతో సంబంధం లేకుండా నటుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు. అతడు దాదాపు అన్ని ఇండస్ట్రీలలో కూడా మంచి సినిమాలలో నటించాడు. ఇక మాధవన్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన కొడుకుకు సంబంధించిన విజయాల గురించి గర్వంగా షేర్ చేసుకుంటున్నాడు. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ అంతర్జాతీయ ఈతల పోటీలలో ఇప్పటికే పలు అవార్డులను అందుకున్నాడు.

అయితే ఇప్పుడు అతను మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం విశేషం. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మాధవన్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఒక తండ్రిగా అతను ఎంతగానో గర్వపడుతున్నట్లు కూడా అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో ప్రొఫెషనల్ స్విమ్మర్ గా వేదాంత్ ఇటీవల ఇండియాలో జరిగిన కేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొన్నారు.

Actor R Madhavan’s son Vedaant wins medals in Khelo India Youth Games 2022

అయితే ఇందులో వేదాంత్ 5 బంగారు పతకాలను గెలుచుకోవడం విశేషం. అలాగే అతను మరో రెండు సిల్వర్ మెడల్స్ ను కూడా గెలుచుకున్నాడు. మధ్యప్రదేశ్‌ లో నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 స్విమ్మింగ్ పోటీలలో మొదట ఫెర్నాండెస్ అపేక్ష 6 గోల్డ్, 1 సిల్వర్ గెలుచుకోగా వేదాంత్ మాధవన్ 5 గోల్డ్ మెడల్స్ 2 సిల్వర్ మెడల్స్ ను గెలుపొందినట్లు మాధవన్ వివరణ ఇచ్చారు.

ఇక అతని గెలుపుకు దోహదపడిన వారికి కోచ్ లకు మాధవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది చాలా గర్వించదగ్గ విషయమని కూడా ఉన్నారు. ఇక తన కొడుకు అవార్డులతో పాటు పతకాలతో పోజులిచ్చిన ఫోటోలను మాధవన్ ట్వీట్ చేశాడు.. అంతే కాకుండా.. దేవుని దయతో - 100మీ, 200మీ అలాగే 1500మీలో గోల్డ్ మెడల్స్ గెలిచాడని ఇక 400మీ, 800మీలో సిల్వర్ మెడల్ దక్కినట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X