పాకిస్థాన్‌తో చర్చలా? మీరు హిందువులేనా? మీది హిందుత్వ పార్టీనేనా? ఆర్ నారాయణమూర్తి ఫైర్

ఏ విషయపైనైనా నిర్భయంగా తన అభిప్రాయాన్ని వెల్లడించే నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం సినిమా పరిశ్రమలో సమస్యలపై తన వాదనను ముక్కుసూటిగా వినిపించిన ఆయన మరోసారి తాజాగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హిందుత్వ వాదాన్ని నిలదీశారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో జరుగుతున్న దాడులు నేపథ్యంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని తన వాదానను వినిపించారు. హిందువులుగా చెప్పుకొనే మీరు.. ఆ సిద్దాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలోఆయన చేసిన ప్రసంగం వివరాల్లోకి వెళితే.

పాకిస్థాన్‌పై యుద్ధం చేస్తున్న సమయంలో ఆ దేశస్థులు కోరిన పిమ్మటనే.. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచన మేరకు వార్ ఆపి శాంతి చర్చలు జరిపారు. ఆ విషయంలో మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. కానీ ఆదివాసీ ప్రాంతంలోని వనరులు ఆ ప్రాంత ఆదివాసీలకే దక్కాలని ఉద్యమం చేస్తున్న వారిపై ఆపరేషన్ కగార్‌ పేరుతో ఈ దేశపు బిడ్డలను కాల్చి చంపుతున్నారు. ఆదివాసీ చట్టాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న వారిపై చంపాలను చూస్తున్నారు అని ఆర్ నారాయణమూర్తి ఆవేశంగా ప్రసంగించారు.

Actor R Narayana Murthy

చత్దీస్‌గడ్ ఆదివాసీయుల ప్రాంతంలో జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో శాంతిని కోరుకొంటున్న వారు చర్చలకు సిద్దం అని అంటున్నా వారిని వదులకుండా కాల్చి చంపడం న్యాయమేనా? కన్నభూమి, కుటుంబాల కోసం ప్రాణత్యాగానికి సిద్దంగా ఉన్నాం. ఉద్యమకారులైన మాకు ప్రాణాలపై ఆశలేదు. మమ్మల్ని చంపొద్దని వేడుకొనడం లేదు. కానీ మీ దాడుల్లో అమాయకులైన ఆదివాసీయులు మరణిస్తున్నారు. అలాంటి అమాయకులు మరణించొద్దనే ఉద్దేశంతో చర్చలు జరపమని కోరుతున్నాం అని ఆర్ నారాయణమూర్తి అన్నారు.

పేద ప్రజలు, అమాయక ప్రజల ప్రాణాలు నష్టపోకూడదనే ఉన్నత ఆశయంతో చర్చలు జరపమని అడిగితే.. మీరు చర్చలు జరపరా? శత్రుదేశమైన పాకిస్థాన్‌తో చర్చలు జరిపారు. ఈ దేశంలో పుట్టిన బిడ్డలు కోరితే చర్చలు జరపకపోవడం అమానుషం. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. కాబట్టి ఇప్పటికైనా కగార్ ఆపరేషన్ ఆపి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ చేశారు. కగార్ అంటే అంచు, అంతం. ఎవరి అంతం చూడాలనుకొంటున్నారు అని ఆయన నిలదీశారు.

ఇది అంతిమ యుద్ధం అంటూ నక్సలైట్లపై మీరు యుద్దం ప్రకటించారు. అసలు నక్సలైట్లు అంటే ఎవరు? ఆకలి ఉన్నంత కాలం, దోపిడి ఉన్నంత కాలం నిలదీసే వాడు నక్సలైట్. వాళ్లు మన భరతమాత బిడ్డలు వారు. అమిత్ షా, మోదీకి ఒకటే రిక్వెస్ట్. మీరు హిందుత్వ పార్టీ అంటారు. మేము హిందువులం అంటారు. మనది హిందూ దేశం అంటున్నారు. అలాంటి దేశంలో హిందూ సంప్రదాయాల ప్రకారం కర్మకాండలు జరగాలనే విషయం మీకు తెలియదా? అని ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు.

Actor R Narayana Murthy

మన దేశంలో, మన సంప్రదాయంలో ఎవరి చనిపోయినా కుటుంబం చేత కర్మకాండలు నిర్వహిస్తారు. అలాంటి కర్మకాండలు జరుపుకోవడానికి అంగీకరించరా? మావోయిస్టు అగ్రనేత చనిపోతే.. ఆయన భార్య నా భర్త చనిపోయాడు. ఆ పార్తీవదేహాన్ని మాకు అప్పగించండి అని చేతులు జోడించి అడిగితే.. ఆయన దేహాన్ని అప్పగించరా? ఆయన కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వరా? అలా ఎంతో మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోతే వారి దేహాలను మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించరా? అని నారాయణమూర్తి ప్రశ్నించారు. యుద్ధశాంతి ప్రకారమైన ఈ నీతిని అమలు పరుచరా? అని అడిగారు. మీరేం హిందువులు, మీది హిందువుల పార్టీనా?, ఇకనైనా కాల్పులు ఆపండి.. చర్చలు జరపండి అంటూ ఆయన కోరారు.

More from Filmibeat

Read more about: r narayana murthy narendra modi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X