తమిళ హీరోయిన్‌తో శ్రీకాంత్ అడ్డాల అఫైర్.. భార్య సూసైడ్ అటెంప్ట్.. సీనియర్ యాక్టర్ క్లారిటీ

చిత్ర సీమలో నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య అఫైర్స్, ప్రేమాయణాలు, పెళ్లిళ్లు, బ్రేకప్స్ సర్వసాధారణం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇవి కామన్‌గా జరుగుతూ వస్తున్నాయి. అయితే పెళ్లయి పిల్లలు ఉన్న వ్యక్తులు ఇలాంటి వాటిలో చిక్కుకున్నప్పుడు విషయం కాస్త సీరియస్ అవుతుంది. గొడవలు, పెద్దల పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, విడాకుల వరకు ఇష్యూ వెళ్తుంది. తాజాగా తెలుగు ఓ తెలుగు టాప్ డైరెక్టర్‌లలో ఒకరైన శ్రీకాంత్ అడ్డాల కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్‌ బృగిదా సాగాతో ఎఫైర్ నడుపుతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు పార్ధిబన్ క్లారిటీ ఇచ్చారు.

కోలీవుడ్‌ వెటరన్ నటుడు పార్ధిబన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. రజనీ, కమల్, విజయ్ కాంత్ , విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలు ఏలుతున్న సమయంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. కే. భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా కెరీర్ ప్రారంభించిన పార్ధిబన్.. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించడంతో పాటు 16 చిత్రాలకు దర్శకుడిగా, 14 చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.

Actor R Parthiban About Director Srikanth Addala secret affiar with kollywood actress

పార్ధిబన్ దర్శకత్వంలో వచ్చిన పుదియా పాడై సినిమా తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించడంతో పాటు ఏకంగా నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సీతతో పరిచయం ప్రేమగా మారి ఆమెను పెళ్లాడారు పార్ధిబన్. ఈ దంపతులకు అభినయ, కీర్తన అనే కుమార్తెలతో పాటు రాఖీ అనే బాబు ఉన్నాడు . ఈ పిల్లాడిని పార్దిబన్, సీతలు దత్తత తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడాకులు తీసుకోగా.. సీత నుంచి విడిపోయిన దాదాపు 25 ఏళ్లుగా పార్ధిబన్ ఒంటరిగానే ఉంటున్నారు. అయితే సీత మాత్రం బుల్లితెర నటుడు సతీష్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ రెండో పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు.

అయితే సినిమాలతో పార్ధిబన్ బిజీగానే ఉన్నారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారిని కూడా పలకరించాడు. ముఖ్యంగా యుగానికి ఒక్కడులో ఆయన నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం ధ్రువ నక్షత్రం పార్ట్ 1లో పార్ధిబన్ నటిస్తున్నారు. ఇటీవల తెలుగు మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చిన పార్ధిబన్ .. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల- బృగిద మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లుగా వస్తున్న గాసిప్స్‌పై స్పందించారు. శ్రీకాంత్ అడ్డాల - బృగిదా సాగాలు పెదకాపు సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని దీంతో ఈ జంట చెన్నైలో సహజీవనం చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి శ్రీకాంత్ అడ్డాల సతీమణి డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

Take a Poll

దీనిపై పార్ధిబన్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ సతీమణి రాగసుధను తానే కోలీవుడ్‌లో పరిచయం చేశానని ఆయన తెలిపారు. శ్రీకాంత్- బృగిదాల మధ్య ఎఫర్ నడుస్తున్నట్లుగా కొన్ని న్యూస్ నా దృష్టికి కూడా వచ్చాయని పార్ధిబన్ వెల్లడించారు. అయితే ఇదంతా ఒట్టిదేనని, అలాంటి ఎఫైర్ ఏం లేదని.. అయినా రాగసుధ ఇలాంటి గాసిప్స్‌ను పట్టించుకునే రకం కాదని పార్ధిబన్ కుండబద్ధలు కొట్టారు. రాగసుధ మంచి నటి అని ఇప్పుడమే చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారని ఆయన తెలిపారు. పార్ధిబన్ వ్యాఖ్యలతోనైనా శ్రీకాంత్ - బృగిదా మధ్య రిలేషన్ వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X