Accident రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు రఘుబాబు కారు.. బీఆర్ఎస్ నేత మృతి

తెలుగు సినీ రంగంలో ప్రముఖ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు మృతి చెందడం విషాదంగా మారింది. ఈ సంఘటన జరిగినప్పుడు నటుడు కారులోనే ఉండటంతో ఆ ప్రాంత గ్రామస్థులతో భారీ వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఆ సంఘటన వివరాల్లోకి వెళితే..

నటుడు గిరిబాబు కుమారుడు, పాపులర్ యాక్టర్ రఘుబాబు ప్రయాణిస్తున్న కారు నల్లగొండ బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. ఆ ఘటనలో నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్ధన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో బైక్‌ను సుమారుగా 50 మీటర్ల దూరం లాక్కెల్లినట్టు తెలిసింది.

Actor Raghu Babu Car hits the BRS Leader vehicle at Nalgonda Bypass Road

ఇక యాక్సిడెంట్ గురైన జనార్ధన్ రావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆ క్షణంలో తుదిశ్వాస విడిచారు. అయితే కారును ఆపి కొన ఊపిరితో ఉన్న ఆయనను హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మరణించారనే విషయం తెలుసుకొన్న పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు అక్కడికి భారీగా చేరుకొన్నారు.

అయితే కారులో నటుడు రఘుబాబు ఉన్న విషయం తెలియడంతో ఈ సంఘటనకు మరింత అటెన్షన్ పెరిగింది. బాధితుడి కోసం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేజారి పోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఆయనను స్టేషన్‌కు తరలించారు. రఘుబాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదానికి గురిచేసింది.

Actor Raghu Babu Car hits the BRS Leader vehicle at Nalgonda Bypass Road

ఇదిలా ఉండగా, రఘుబాబుపై కేసు నమోదు చేసి అతడిని అక్కడి నుంచి సురక్షితంగా పంపించినట్టు సమాచారం. అయితే ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలను నేతలు, సినీ వర్గాలు చేస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X