చిరంజీవి వల్లే.. 400 సినిమాలు.. చనిపోయే వరకు గుర్తుంటుంది.!
చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు నటుడు రఘబాబు. కామెడీ విలన్ గా, సపోర్టింగ్ పాత్రలతో కొన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. 90ల నుంచే రఘుబాబు సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. కామెడీ రోల్స్, కామెడీ విలన్ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తన పాత్రల్లో కొత్తదనాన్ని చూపిస్తూ ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటున్నారు. 1992లో వచ్చిన 'మొండిమొగుడు పెంకి పెళ్లాం' చిత్రంలో నటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ఇండస్ట్రీలో అప్పటి బడా హీరోల చిత్రాలతో పాటు ఇప్పటి యంగ్ హీరోల సినిమాల్లోనూ కొన్ని ముఖ్య పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూనే వస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా రఘుబాబు 'బ్రహ్మానందం' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. కామెడీ లెజెండ్ బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి నటించిన చిత్రమిది. వాలెంటైన్స్ సందర్భంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలైంది. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరిస్తోంది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రఘుబాబు కూడా హాజరై సినిమా గురించి పలు విషయాలు చెప్పారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆయనకి ఎలా సహకరించారో చెప్పే ప్రయత్నం చేశారు. చిరు సాయం వల్లే ఆయన ఈ స్థాయికి వచ్చినట్టు చెప్పుకొచ్చారు.

రఘుబాబు నటించిన చిత్రాల్లో 'బన్నీ' సినిమా ఆయనకు మంచి మైలేజ్ ను ఇచ్చింది. ఆ మూవీలో ఆయన పెర్ఫామెన్స్ అప్పట్లో ట్రెండ్ ను సెట్ చేసింది. అయితే.. ఆ మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చేసిన మాటసాయంతో ఆయన 400 సినిమాలు పూర్తిచేయగలిగానని చెప్పారు. ఆ ఈవెంట్ కు వచ్చిన చిరు వేదికపై అందరి గురించి మాట్లాడారు గానీ.. తన గురించి మాట్లాడలేదని బాధపడ్డారంట. కానీ ఈవెంట్ అయ్యాక మెగాస్టార్ రఘుబాబును ప్రత్యేకంగా పిలిచి తన పాత్ర ఎంతోగానో నచ్చిందని.. నీ కోసం మళ్లీ సురేఖతో కలిసి సినిమాకు వెళ్తున్నానని బూస్ట్ ఇచ్చారంట. ఆ రోజు లైఫ్ లో ఎప్పుడూ లేని ఎనర్జీ వచ్చిందని.. మెగాస్టార్ ఆరోజు ఇచ్చిన పుష్ తో 400 వరకు సినిమాలు చేశానని.. ఆయన మాటసాయం వల్లే ఈస్థాయిలో ఉన్నానని.. చనిపోయే వరకు చిరు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుంటునానని ఎమోషనల్ అయ్యారు.
ఇక మెగాస్టార్ తనకు దృష్టికి వచ్చిన వారి సమస్యలను వీలైనంతగా తీర్చేందుకు సహకరిస్తూనే ఉంటారు. ఆ మధ్యలో విలన్ పొన్నంబళం అనారోగ్యం బారిన పడటంతో వైద్యఖర్చులు మొత్తం చిరునే భరించిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో సాయం పొందిన వారు కూడా చిరుపై అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ ప్రస్తుతం 'విశ్వంభర' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











