విభిన్నమైన పాత్రలకు ఎప్పుడూ రెడీ.. రెహమాన్
విలక్షణమైన నటన, విభిన్నమైన పాత్రలతో టాలీవుడ్, తమిళ ప్రేక్షకులను నటుడు రెహమాన్ మూడు దశాబ్దాలుగా ఆకట్టుకొంటున్నారు. తాజాగా మరో విభిన్నమైన పాత్రతో సెవెన్ (7) అనే మూవీలో నటిస్తున్నారు. బాలకృష్ణతో సింహా, ప్రభాస్‌తో భిల్లా సినిమాలో నటించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని తెలుగులో సెవెన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా జూన్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తన భావాలను పంచుకొన్నారు.
హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడక్షన్స్ బేనర్లో రమేష్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'సెవెన్'. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రెహమాన్ ముఖ్యపాత్రలో నటించారు. లక్షణ నటుడిగా రహమాన్ సెవెన్ సినిమా లో కీ రోల్ లో కన్పించనున్నాడు.

ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ... సెవెన్ తన కెరీర్ లో చెసిన ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని. సినిమా మొదటి నుంచి చివరి వరకు సినిమాలొని ప్రతి సన్నివేశాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చెస్తారు. నా పాత్ర సినిమాలొ కీలకం. ఇలా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చెయటానికే నేను ఎప్పుడు సిద్దమే అని రెహమాన్ అన్నారు. యువ హీరో హావీష్ కమిట్‌మెంట్ తనకు నచ్చిందని, నాకు కథ నచ్చితే పాత్ర నిడివి అనే విషయాన్ని పట్టించుకోను అని అన్నారు.
ఇదిలా ఉండగా, ఆయన నటించిన 'వైరస్' అనే సినిమా మలయాళంలో ఈనెల 7 న రిలీజ్ అవుతుండగా, 'సెవెన్' తెలుగులో 5 న రిలీజ్ అవుతుండడం విశేషం.


Click it and Unblock the Notifications











