Mukul Dev Death: నా తమ్ముడి మరణం వెనుక వాళ్లే.. ప్రభాస్ విలన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ మరణం చిత్ర సీమలో విషాదం నింపింది. ప్రతిభావంతుడిగా, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ముకుల్ దేవ్ చివరి రోజుల్లో డిప్రెషన్‌కు గురయ్యాడని.. దీని వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన సోదరుడు, నటుడు రాహుల్ దేవ్ క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు ముకుల్ డిప్రెషన్ వల్ల చనిపోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

బుల్లితెర నుంచి వెండితెరకు
ముకుల్ దేవ్ 1996లో వచ్చిన మంకీన్‌ అనే సీరియల్‌లో విజయ్ పాండే అనే పాత్రతో నటన రంగం వైపు అడుగుపెట్టారు. తర్వాత దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయిన ఏక్ సే బాద్ కర్ ఏక్ అనే మరో కామెడీ సీరియల్ ముకుల్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా సీజన్ 1కు హోస్ట్‌గా ఆ కార్యక్రమాన్ని ముకుల్ దేవ్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. టెలివిజన్ రంగంలో రాణిస్తున్న సమయంలోనే సినిమాలలోనూ ఆయనకు అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన నిర్మాణ సంస్థ నిర్మించిన నామ్ క్యా హై సినిమాలో ఆయన ఆఫర్ అందుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ సినిమా నిర్మాణం జరుపుకోలేదు.

Actor Rahul Dev Reveals Why His Brother Mukul Dev s Death

మే 23న కన్నుమూసిన ముకుల్ దేవ్
దస్తక్‌లో ఏసీపీ రోహిత్ మల్హోత్రాగా ముకుల్ దేవ్‌ నటించారు. ఈ చిత్రం సుస్మితా సేన్ డెబ్యూ మూవీ కావడం గమనార్హం. ఆ తర్వాత ఖిలా, వాజూద్ వంటి సినిమాలలో నటించారు. 2008లో వీవీ వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. చివరిసారిగా భాయ్‌లో కనిపించిన ఆయన తర్వాత మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. దాదాపు మూడు దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, కన్నడ, పంజాబీ, హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్ , మలయాళీ భాషల్లో నటించారు ముకుల్ దేవ్. 2020లో జీ5లో వచ్చిన స్టేట్ ఆఫ్ సీగ్: 26/11 వెబ్ సిరీస్‌‌లో నటించారు. నటనతో పాటు ఆయన ప్రొఫెషనల్ పైలట్, రన్నర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్ దేవ్‌ను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మే 23న ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఒంటరితనంతో కృంగిపోయిన ముకుల్
తాజాగా సోదరుడి మరణంపై రాహుల్ దేవ్ స్పందించారు. తమ తండ్రి మరణం తమ్ముడిపై ప్రభావం చూపించిందని ఆ వెంటనే మా అమ్మగారు చనిపోవడం, భార్యతో విడాకులతో ముకుల్ మరింత కృంగిపోయాడని తెలిపారు. సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చినా వదలుకున్నాడని చెప్పారు. ఈ పరిణామాలతో ఒంటరిగా ఉండటానికే ముకుల్ ఇష్టపడేవాడని.. శరీరాన్ని, ఆరోగ్యాన్ని చివరికి భోజనం చేయడం కూడా పట్టించుకోవడం మానేశాడని రాహుల్ దేవ్ వెల్లడించారు.

ఒక్కరు కూడా పట్టించుకోలేదు
అతను ఫిట్‌గా లేడని రకరకాల ఆరోపణలు చేస్తున్నారని.. కానీ అది నిజం కాదని హాఫ్ మారథాన్‌లో పరిగెత్తే సామర్ధ్యం నా తమ్ముడికి ఉందని తెలిపారు. చివరి రోజుల్లో ఎవరూ తనకు అండగా లేరని.. ఈ రోజు అతనిపై, మా కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న ఎవరైనా ముకుల్ బతికున్న రోజుల్లో కనీసం ఆసుపత్రికి వచ్చి పరామర్శించారా? అని రాహుల్ దేవ్ ప్రశ్నించారు. ముకుల్ వారంపై ఆసుపత్రిలో ఉన్నాడని.. భోజనం చేయకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్లే చనిపోయాడని డాక్టర్లు కూడా చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Read more about: rahul dev mukul dev movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X