పచ్చి పులుసుతో పడగొట్టాను.. ఈమె నా జీవనరేఖ.. లవర్ ఫోటో రాహుల్ రామకృష్ణ ట్వీట్
అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొద్దికాలంగా ప్రేమలో పడిన ఈ యువ నటుడు పెళ్లీ పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం తాను ప్రేమలో పడ్డాను.. పెళ్లి కూడా చేసుకోబోతున్నాను అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన ప్రియురాలి ఫొటోను షేర్ చేశారు.

నాతో ఫోటోలో ఉన్న మహిళ నా జీవనరేఖ. గతేడాది ఈమెను పచ్చి పులుసుతో పడొగొట్టాను అని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. తన ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను ట్యాగ్ చేశారు.
కెరీర్ విషయానికి వస్తే రాహుల్ రామకృష్ణ ఇటీవల కాలంలో మంచి పాత్రల్లో తెర మీద మెరిశాడు. హుషారు, భరత్ అనే నేను తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రియదర్శితో కలిసి ఆయన నటించిన మిఠాయి చిత్రం నిరాశను పంచింది. ప్రస్తుతం మంచి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ రాహుల్ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











