Cricket Coach టీమిండియా క్రికెట్ కోచ్ రేసులో టాలీవుడ్ హీరో .. సోషల్ మీడియాలో వైరల్‌గా పోస్ట్!

టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ రానున్నారు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం త్వరలో ముగియనుంది. వాస్తవానికి 2021 నుంచి 2023 వరకు కోచ్‌గా ఉన్న ద్రావిడ్‌ను టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు ద్రావిడ్ కోచ్‌గా ఉంటారు.. మరోసారి రెన్యువల్ చేసేందుకు బీసీసీఐ సిద్ధమైనా కొనసాగేందుకు ఆయన మాత్రం సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాకు కొత్త కోచ్‌ను అన్వేషించే పనిలో బీసీసీఐ పడింది.

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐలో పనిచేయడానికి ఎంతోమంది పోటీ పడుతుంటారు. దేశీయ, అంతర్జాతీయ క్రికెటర్లు టీమిండియా హెడ్ కోచ్‌గా చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కోట్ల రూపాయల పారితోషికం, ఇతర భత్యాలు కూడా ఇందుకు కారణం కావొచ్చు. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ కొన్ని అర్హతలు పెట్టింది. అవేంటంటే.. 60 ఏళ్లకు మించి వయసు ఉండరాదు, కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. లేదా టెస్టులు ఆడుతున్న జట్లకు రెండేళ్లపాటు హెడ్ కోచ్‌గా పనిచేసి ఉండాలి. ఐపీఎల్ ఫ్రాంచైజీ, ఫస్ట్ క్లాస్ , అంతర్జాతీయ, జాతీయ జట్లకు కనీసం 3 ఏళ్ల పాటు హెడ్ కోచ్‌గా పనిచేసి ఉండాలి.

actor rahul ravindran applies for team india head coach position post

టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లో భారత పురుషుల జట్టు బాధ్యత.. నిర్వహణ అంతా హెడ్ కోచ్‌దేనని బీసీసీఐ స్పష్టం చేసింది. అతని కింద 14 నుంచి 16 మంది ఇతర సిబ్బంది ఉంటారని.. దరఖాస్తులకు మే 27 చివరి తేదీగా ప్రకటించింది. కొత్తగా నియమితులైన హెడ్ కోచ్ 2024 జూలై 1 నుంచి 2027 డిసెంబర్ 31 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత హెడ్ కోచ్ పదవికి పోటీపడిన వారిని బీసీసీఐ ఇంటర్వ్యూ చేయనుంది.

అన్ని చెప్పి టీమ్ ఇండియా హెడ్ కోచ్ జీతం ఎంతో చెప్పకపోతే బాగుండదు కదా. అతని అనుభవం ఆధారంగా జీతం గురించి చర్చిస్తామని బీసీసీఐ పేర్కొంది. దీనిపై ఖచ్చితమైన వివరాలు లేకపోయినప్పటికీ.. గతంలో ఓ మీడియా సంస్థ టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి జీతం గురించి కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం రవిశాస్త్రికి ఏడాదికి రూ.9.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య జీతాన్ని చెల్లిస్తోంది. అయితే ఇది 2021 నాటి మాట.. ఇప్పుడు దీని కంటే ఎక్కువ మొత్తంలోనే టీమిండియా హెడ్ కోచ్‌గా వచ్చే వ్యక్తి పొందనున్నాడు.

actor rahul ravindran applies for team india head coach position post

మరి ఎంతో పేరు, క్రేజ్, డబ్బును తీసుకొచ్చే ఈ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు పోటీ ఎక్కువైంది. మనదేశంతో పాటు విదేశీ క్రికెటర్లు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవికి సినీనటుడు , డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా పోటీపడ్డారు. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసిన ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ దరఖాస్తును బీసీసీఐ అంగీకరించలేదట. వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ మొత్తం నింపాక.. ఈ ఫాంను తాము స్వీకరించలేమంటూ రాహుల్‌కు మెసేజ్ వచ్చిందట. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

దరఖాస్తును నింపడం సరదాగా ఉంటుందని అనుకున్నానని.. నేను కూడా ఒకసారి టీమిండియా హెడ్‌కోచ్ కావాలని అనుకున్నట్లు నా పిల్లలకు ఏదో ఒక రోజు చెప్పాలని భావించాను.. కానీ అంటూ రాహుల్ రవీంద్రన్ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవి దరఖాస్తును బీసీసీఐ ఓపెన్ గూగుల్ ఫార్మ్స్‌లో అందుబాటులో ఉంచడంతో ఇదే అదనుగా పలువురు నెటిజన్లు రాహుల్ రవీంద్రన్ మాదిరిగానే దరఖాస్తు చేసుకుంటూ ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వందలాది అప్లికేషన్లు రావడంతో బీసీసీఐ తలపట్టుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X