శివాని రాజశేఖర్ మొదటి సినిమా ఫస్ట్ లుక్.. కుర్ర హీరోతో రొమాంటిక్ కథ!
జీవిత రాజశేఖర్ కూతుళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యేలా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఒక అమ్మాయి దొరసాని సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి సింపుల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక నెక్స్ట్ కూడా అదే తరహాలో మరో అమ్మాయి శివాని కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. నేడు శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఫాంటసీ, రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. చూస్తుంటే శివాని ఈ సినిమాలో కొత్తగా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ తోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పెళ్లి గోల వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మహాతేజ క్రియేషన్స్ అనే కొత్త బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పై త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఇక మరోవైపు శివాని సోదరి శివాత్మిక దొరసాని సినిమాతో సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. నెక్స్ట్ సినిమాతో అయినా మంచి సక్సెస్ అందుకోవాలని ఈ అక్కా చెల్లెల్లు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











