Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Shekar సినిమాకు మరో సమస్య.. ద్వేషంతోనే అలా చేశారు అంటూ హీరో రాజశేఖర్ ఆవేదన!
తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ హీరోగా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్ ప్రస్తుతం కూడా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన శేఖర్ సినిమా కూడా ఓ వర్గం ప్రేక్షకులు అయితే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని రాజశేఖర్ అలాగే ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ కూడా ప్రమోషన్స్ లో తెలిపారు. అయితే ఈ సినిమాను కావాలని కుట్రతో కొంతమంది అడ్డుకుంటున్నారు అని రాజశేఖర్ రీసెంట్ గా సోషల్ మీడియాలో స్పందించడం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మలయాళ సినిమాకు రీమేక్..
మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాజశేఖర్ చాలా కాలం తర్వాత శేఖర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న జోసెఫ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. జీవిత రాజశేఖర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ సినిమాను పూర్తి చేసినట్లుగా ఇటీవల రాజశేఖర్ తెలియజేశారు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజశేఖర్ ఆందోళన?
అంతేకాకుండా శేఖర్ సినిమాను రాజశేఖర్సొంత బ్యానర్ లోనే నిర్మించినట్లుగా తెలియజేస్తూ కొన్ని ఆస్తులు కూడా దీనిపైన పెట్టుబడిగా పెట్టినట్లుగా వివరణ ఇచ్చారు. సినిమా ఏ మాత్రం తేడా వచ్చినా కూడా చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తప్పకుండా ఈ సినిమా తమకు మంచి విజయాన్ని అందించాలని కూడా వాళ్లు కోరుకున్నారు.
రాజశేఖర్ ఆవేదన
అయితే శేఖర్ సినిమాను కొందరు కావాలని అడ్డుకుంటున్నారు అని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. రీసెంట్ గా తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసిన రాజశేఖర్ సినిమా ఆడకుండా చేసేందుకు కొందరు కావాలని కుట్ర పూరితంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఆయన ఇందులో వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
కేవలం ద్వేషంతో..
శేఖర్ అనే సినిమా నా కుటుంబానికి సర్వస్వం, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేం చాలా కష్టపడ్డాం.. శేఖర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ ఈరోజు కేవలం ద్వేషంతో కొందరు కుట్ర చేసి మా సినిమా ప్రదర్శనను ఆపేశారు. సినిమా మా ప్రాణం, ఈ సినిమా ముఖ్యంగా మా ఆశ.. చెప్పాల్సినవి అయిపోయాయి. ఈ చిత్రానికి నిజంగా ప్రశంసలు చివరికి లభిస్తాయని నేను ఆశిస్తున్నాను.. అని రాజశేఖర్ వివరణ ఇచ్చారు.
ఎందుకంటే..?
అయితే శేఖర్ సినిమాను ఎందుకు ఆపేశారు అనే విషయంలో కూడా వివిధ రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి. పలు ఆర్థిక సమస్యల కారణంగా శేఖర్ సినిమాను కొన్ని థియేటర్స్ లో నిలిపివేస్తున్నట్లు గా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తిస్థాయిలో రాజశేఖర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.