మమ్మల్ని పట్టించుకోండి .. ట్విట్టర్‌లో మొరపెట్టుకొన్న డాక్టర్ రాజశేఖర్

ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి నిద్ర పోయే వరకు మన చుట్టూ ఎన్నో సమస్యలు. వాటితో పోరాడుతూ మనిషి తన జీవిత గమనంలో సాగిపోతుంటాడు. కొన్నింటికి మనిషి తట్టుకోగలడు, మరికొన్నింటికి తట్టుకోలేక కృంగిపోనూగలడు. మనమే లాక్కోలేక పీక్కోలేక నానా బాధలు పడుతుంటే సమాజంలో తిష్టవేసిన అంశాలపై ఎక్కడ స్పందించగలం. కుళాయి రాకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం, రోడ్లు బాగుండకపోవడం, చెత్త ఎత్తేవాడు రాకపోవడం ఇలాంటివి మనకు చిన్నవిగా కనిపించవచ్చు.. కానీ చాలా మందికి ఇవి పెద్ద నష్టాలనే కలగజేస్తాయి.

ప్రజలు ఓట్లేసి నేతల్ని గెలిపించేది.. కూడు, గూడు, గుడ్డ కల్పిస్తారనే కాదు. వీధి లైట్లు, రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు అనే కనీస అవసరాలు అందిస్తారని కూడా. స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్ధాలు గడుస్తున్నా భారతదేశంలో ఎన్నో సమస్యలు నేటికి అపరిష్కృతంగానే ఉన్నాయి. కుళాయిలు రావడం లేదని, లైట్లు వెలగటం లేదనే ఫిర్యాదులు .. నేతలు, అధికారులకు చాలా చిన్నగా కనిపించి తేలిగ్గా కొట్టిపడేస్తారు. కానీ పడే వాడికే ఆ బాధ తెలుస్తుంది కదా. సామాన్యుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందేమో కానీ.. ప్రముఖుల విషయంలో మాత్రం ఆగమేఘాల మీద స్పందిస్తూ ఉంటారు.

actor rajasekhar tweet on drainage leak issue at his residence in hyderabad

ఇదిలాఉండగా.. తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్‌మెన్ ఇమేజ్ కలిగిన డాక్టర్ రాజశేఖర్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించి ఏడిపించినా.. అల్లరి ప్రియుడిగా గిలిగింతలు పెట్టించినా ఆయనకే చెల్లింది. పోలీస్ పాత్రలకు జీవం పోసి ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సినిమాల్లో రాజశేఖర్ నటించారు. ఒకానొక దశలో అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ వంటి వారికి తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చారు రాజశేఖర్.

కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలున్నా.. హిట్‌లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు డాక్టర్ రాజశేఖర్. ఆయన పని అయిపోయిందని అవమానాలు ఎదుర్కొన్నప్పుడల్లా.. తన సినిమాలతోనే ఆన్సర్ ఇచ్చేవారు. కొద్దినెలల క్రితం పీఎస్‌వీ గరుడవేగతో తన విశ్వరూపం చూపించారు. ఆ వెంటనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కిలో నటించి సత్తా చాటారు రాజశేఖర్. తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజశేఖర్ .. టాలీవుడ్‌లో సెలబ్రెటీ కపుల్‌గా మన్ననలు అందుకుంటున్నారు. ఈ దంపతులకు శివానీ, శివాత్మిక అనే కుమార్తెలున్నారు. వీరు హీరోయిన్స్‌గా రాణిస్తూ.. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నారు.

మనం పైన చెప్పుకున్న చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిలో సామాన్యులే కాదు.. డాక్టర్ రాజశేఖర్ కూడా ఉన్నారు. తాను నివసించే వీధి వెంబడి డ్రైనేజీ లీక్ సమస్యల వల్ల ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన వాపోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లో అశ్విని హైట్స్ వద్ద డ్రైనేజీ లీకేజీ సమస్య వేధిస్తోందని.. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ , నేటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. దయచేసి ఇప్పటికైనా పట్టించుకుని, సమస్యను పరిష్కరించాలంటూ డాక్టర్ రాజశేఖర్ ట్వీట్ చేశారు. డ్రైనేజీ లీక్ అవుతున్న ఫోటోను కూడా ఆయన ట్వీట్‌కి జత చేసిన ఆయన.. జీహెచ్ఎంసీ మేయర్ , కమీషనర్‌లకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: dr rajasekhar drainage leak ghmc
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X