twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డైరెక్టరే నాకు పెద్ద సమస్య.. క్లైమాక్స్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో రాజేంద్ర ప్రసాద్

    |

    కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై దర్శకుడు భవాని శంకర్ డైరెక్షన్‌లో కరుణాకర్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి నిర్మించిన చిత్రం క్లైమాక్స్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, శశ సింగ్, శ్రీ రెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ ప్రముఖులు, మీడియా సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు యఫ్‌డిసి చైర్మన్ రామ్మోహన్ రావు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లైమాక్స్ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..

    అందుకే థియేటర్‌కు దండం పెట్టా

    అందుకే థియేటర్‌కు దండం పెట్టా

    లాక్‌డౌన్ విధించడంతో మీడియాతో, ప్రేక్షకులు, అభిమానులతో మాట్లాడి చాలా రోజులు అయింది. లాక్‌డౌన్ ఎత్తి వేసిన తర్వాత థియేటర్లు ఓపెన్ అవుతున్నాయనే వార్తతో నేను చాలా ఎమోషనల్ అయ్యాను. సోలో బతుకే సో బెటర్ సినిమా చూడటానికి వెళ్లి థియేటర్‌కు దండం పెట్టి ఆ సినిమా చూశాను. ఎందుకంటే మాకు జీవితాన్ని, కూడు ఇచ్చింది సినిమా థియేటర్. అందుకే సంస్కారాన్ని తెలియజేయడానికి నేను అలా చేశాను అని నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

    డైరెక్టర్ భవానీ శంకర్ నాకు పెద్ద సమస్య

    డైరెక్టర్ భవానీ శంకర్ నాకు పెద్ద సమస్య

    ఇక క్లైమాక్స్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమా డైరెక్టర్ భవానీ శంకర్ నాకు సమస్య. సమస్య అంటే అందరూ ఏంటి డైరెక్టర్ మంచి అవకాశాలు ఇస్తుంటే సమస్య అని అనుకొంటారేమో. కానీ ఆయన నా వద్దకు ప్రతీసారి ఒక విభిన్నమైన కథతో వస్తుంటారు. అదే నాకు సమస్య అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

    క్లైమాక్స్ సబ్జెక్ట్ గొప్పగా ఉంటుంది

    క్లైమాక్స్ సబ్జెక్ట్ గొప్పగా ఉంటుంది

    క్లైమాక్స్ సినిమా చూడగానే ప్రేక్షకులు నిజంగా షాక్ గురవుతారు. సబ్జెక్ట్ అలా ఉంటుంది. రాజేంద్ర ప్రసాదా? ఈ రేంజ్ పెర్ఫార్మెన్సా అంటూ షాక్ తినడం గ్యారెంటి. అలాంటి పాత్రను, క్యారెక్టర్ నా కోసం సిద్ధం చేస్తుంటారు. నాకన్నా నాకు వచ్చిన అవకాశాలే గొప్ప. నా కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో వెరైటీ హీరో పాత్రలు చేశాను. అందుకు కారణం భవానీ శంకర్ లాంటి గొప్ప రచయిత, డైరెక్టర్లే అంటూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

    అద్భుతమైన పాత్రతో వస్తున్నా

    అద్భుతమైన పాత్రతో వస్తున్నా

    క్లైమాక్స్ ట్రైలర్‌లో నా పాత్రను చూస్తే.. రాజేంద్ర ప్రసాద్‌ను ఇంతకు ముందు ఇలా చూసి ఉండరు. మామూలుగా ఆ రోల్‌ను చూస్తే విలన్ అంటారు. కానీ నిజ జీవితంలో హీరో అంటారు. అలాంటి అద్భుతమైన పాత్రను దర్శకుడు భవానీ ప్రసాద్ నాకు ఇచ్చారు. అందుకు నేను ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు

     క్లైమాక్స్ సినిమా ఢిఫరెంట్

    క్లైమాక్స్ సినిమా ఢిఫరెంట్

    క్లైమాక్స్ లాంటి సినిమాను ఎలా రిలీజ్ చేశామన్నది మనకు ముఖ్యం. ఇలాంటి సినిమాను ప్రేక్షకుల వద్దకు ఎలా తీసుకెళ్లామనేది ముఖ్యం. రామ్మెహన్ రావు గారు, ప్రసన్న గారి సహకారంతో సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలి. ఈ చిత్రంలో మీరు ఊహించిన దానికి కన్నా ఎన్నో రెట్లు నా ఫెర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను చాలా ఇష్టపడి గెటప్ వేసుకొన్నాను., నా బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

    English summary
    Actor Rajendra Prasad's latest movie is Climax. This movie is directed by Bhavani Shankar. This movies's trailer release function organised at Film Chamber of Hyderabad on Feb 12. Rajendra Prasad made sensation speech about Climax Director Bhavani Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X