బిచ్చగాడికైనా బిల్ గేట్స్‌కైనా.. ‘క్లైమాక్స్’లో రాజేంద్ర ప్రసాద్ రచ్చ
రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్‌గా వస్తోన్న చిత్రం క్లైమాక్స్. శ్రీరెడ్డి కూడా ఓ ముఖ్య పాత్రను పోషించింది. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై దర్శకుడు భవాని శంకర్ డైరెక్షన్‌లో కరుణాకర్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి నిర్మించిన చిత్రం క్లైమాక్స్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రంలో శశ సింగ్, శ్రీ రెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ ప్రముఖులు, మీడియా సమక్షంలో విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో రాజేంద్రప్రసాద్ గెటప్ బాగానే క్లిక్ అయింది. జల్సా రాయుడు, శృంగార పురుషుడిగా రాజేంద్ర ప్రసాద్ దుమ్ములేపబోతోన్నాడు. ఫేమస్ అవ్వాలి.. సినిమా తీయాలి.. అంటూ రాజేంద్ర ప్రసాద్ మోడీ అనే పాత్రలో కనిపించబోతోన్నాడు. ఇందులో డబ్బు చుట్టూ సినిమా తిరుగుతుందని, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ని కలిపేసినట్టు కనిపిస్తోంది. బిచ్చగాడికైనా బిల్ గేట్స్‌కు అయినా కష్టసుఖాల్లో తేడా ఉండదంటూ రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది.

నిన్న జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు యఫ్‌డిసి చైర్మన్ రామ్మోహన్ రావు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మీరు ఊహించిన దానికి కన్నా ఎన్నో రెట్లు నా ఫెర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను చాలా ఇష్టపడి గెటప్ వేసుకొన్నాను., నా బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని అన్నాడు.


Click it and Unblock the Notifications











