మీ సంస్కారం.. అది ఖర్మ.. నేనేమీ చేయలేను.. ఆలీపై బూతులపై రాజేంద్ర ప్రసాద్
తెలుగు సినిమా పరిశ్రమలో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి అర్చన, యువ హీరో రూపేశ్, హీరోయిన్ ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం షష్టిపూర్తి. మా ఆయి క్రియేషన్స్ బ్యానర్ మీద రూపేశ్ నిర్మించిన చిత్రానికి యువ దర్శకుడు పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కింది. తల్లిదండ్రులు, పిల్లల ప్రేమనురాగాలను చాటి చెప్పే చిత్రంగా రూపొందిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో సోమవారం నాడు కల్టరల్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాజాగా ఆలీని ఓ ఫంక్షన్‌లో తిట్టిన విషయంపై పరోక్షంగా స్పందించారు. ఆయన ఆలీ మీద చేసిన కామెంట్స్, ఆ తర్వాత దానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలకు రాజేంద్రప్రసాద్‌తోపాటు సినీ నటులందరూ హాజరయ్యారు. శ్రీకాంత్, ఆలీ, తదితరులు ఈ వేడుకలో పాలుపాంచుకొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఆలీని ఉద్దేశించి.. లXXX కొడకా అంటూ జోష్‌లో ఓ మాటను వదిలారు. ఆ మాటకు ఆలీ నవ్వుతూ ఏం చెప్పాలో తెలియక అదోరకమైన పీలింగ్‌తో కనిపించారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలోను, సోషల్ మీడియాలోను భిన్న స్వరాలు వినిపించాయి. ఆలీపై చేసి ఆ వ్యాఖ్యలను రాజేంద్ర ప్రసాద్ సమర్ధించుకొన్నారు. ఆలీపై నాకు ఉన్న ప్రేమ అలాంటింది అని చెప్పారు.

మ్యాజిక్ మేస్ట్రో ఇళయరాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. లేడీస్ టైలర్ టైమ్‌లోనే ఆయనను నేను సామీ అని పిలిచే వాడిని. ఎందుకంటే తెల్లటి దుస్తులు ధరించి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి ఎప్పుడు పడుకొంటాడో మాకు తెలియదు. ఆయనకు ఎప్పుడూ సంగీతం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఆయన నేను నటించిన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఒరేయ్ అని పిలిచాడు. ఇటీవల చేసిన ఇంటర్వ్యూలో వీడు మా వాడు అంటూ నన్ను మెచ్చుకొన్నాడు. అది నాపై ఆయనకు ఉన్న ప్రేమ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఇటీవల కాలంలో నేను స్టేజీ మీద ఏదైనా ప్రేమతో మాట్లాడితే.. దానికి పెడదర్థాలు తీస్తున్నారు. అది మీ ఖర్మ. నేను ఇలాగే ఉంటాను. మీరు మరోలా అర్ధం చేసుకొంటే అది మీ సంస్కారం. ఈ సినిమాను మీడియా భుజాల మీద వేసుకొని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లారు. అందుకే నేను మీడియాను ఎప్పుడూ మీడియాగా చూడలేదు. నా ఫ్యామిలీగానే చూశాను. నా ఫ్యామిలీ అని చెప్పుకొంటాను. ఆ విషయం మీకు తెలుసు. మీరందరూ నన్ను అన్నయ్య అని పిలువడం నా జన్మకు ధన్యం. నా నిజమైన సక్సెస్‌ను ఎంజాయ్ చేసేందుకు నేను ఎక్కువ సేపు మాట్లాడేందుకు అనుమతి తీసుకొంటాను అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

అయితే యాంకర్ మంజూషకు రాజేంద్ర ప్రసాద్ చిన్న ఝలక్ ఇచ్చారు. యాంకర్ అమ్మాయి కల్చరల్ హిట్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అది కల్చరల్ హిట్ కాదు. కల్ట్‌రల్ హిట్ (Cultural Hit) అని ఆమె తప్పుగా మాట్లాడే తీరును సరిద్దిద్దారు. నేను స్టేజీ మీద సరదాగా మాట్లాడుతుంటాను. నేను ఆ హీరోయిన్‌ను తీసుకొచ్చాను. ఈ హీరోయిన్‌ను పరిచయం చేశాను అంటే.. దానిని తప్పుగా తీసుకొంటున్నారు. కొన్ని చోట్ల వేరే అర్ధం చేసుకొంటున్నారు. అది వారి ఖర్మ. నేను ఇలాగే ఉంటాను. ఎవరేమనుకొన్నా పర్వాలేదు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఆలీని నేను తిట్టిన విషయం గురించే ఆలోచిస్తున్నారు. కానీ వాడిపై నాకు చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమ కారణంగా అలాంటి మాటలు వచ్చాయి. వాడిని నేను చిన్నప్పటి నుంచి చూశాను. వాడు నాతో ట్రావెల్ చేశాడు. కాబట్టి అలా సరదాగా మాట్లాడి ఉంటాను. వేరే ఎవరితో అలా బిహేవ్ చేయను కదా అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.


Click it and Unblock the Notifications











