ముసలి ముండా కొడుకా.. బ్రహ్మనందంపై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిర్మాతగా హోచ్ మహదేవ్ గౌడ్, హోచ్ నాగరత్న, దర్శకులుగా ఉదయ్ శర్మ పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం స:కుటుంబానాం. ఈ చిత్రంలో రామ్ కిరణ్ హీరోగా, మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించడం విశేషం. మధు దాసరి సినిమాటోగ్రాఫర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెచ్ఎన్‌జీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథి పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సనా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, నటకిరిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఫన్నీగా, ఎమోషన్‌ల్‌గా మాట్లాడుతూ.. బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత మాట్లాడటం అంటూ ఏదో నసిగాడు. నువ్వు కూడా మాట్లాడు అంటే.. ముసలి ముండ కొడుకువి అన్నాడు. దాంతో షాక్ తిన్న బ్రహ్మానందం.. ఎవరు? అని ప్రశ్నించగానే.. నేను అంటూ మాటమార్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..

నేను ఏ పాత్ర చేసినా ప్రేక్షకులకు గుర్తుంచుకొంటేనే నా జీవితానికి అర్ధం ఉంటుంది. 48 ఏళ్ల నట జీవితం గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలి. ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి పనిచేస్తూనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే నన్ను ఎప్పుడో ఇంటికి పంపించేసేవారే. ఇంకా మేము ఉన్నామంటే నటనే.. అని తన నటజీవితం గురించిని ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ ప్రయాణంలో నాకు మీడియా అన్నివేళలా అండగా నిలిచారు. మీరందరూ ఇన్ని సంవత్సరాలుగా సొంత బిడ్డలాగా చూసుకొంటున్నారు. అందుకు జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా ఇండస్ట్రీలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటే.. మంచి పాత్రలే చేయాలి అని తన నటజీవితంలో జరిగిన విషయాలను, భాషపట్ల పట్టుదల గురించి పలు విషయాలు పంచుకొన్నారు. ఓ సారి కృష్ణా జిల్లాలో ఇంటికి వెళ్లినప్పుడు అక్క భోజనానికి పిలిస్తే.. ఆయ్ అంటూ సమాధానం చెప్పాను. దాంతో ఆయ్ ఏంట్రా సచ్చినోడా అంది. లేడీస్ టైలర్ సినిమా చేసినప్పుడు వంశీగారు ఆ భాషను నేర్పించాడు.
ఆ తర్వాత రమేష్ చప్పాలా ప్రొత్సాహంతో లగ్గం సినిమాలో తెలంగాణ భాష నేర్చుకొని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాను. దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను. ఆ భాషను మాట్లాడినందుకు స్వర్గీయ కాంతారావు పేరు మీద పెట్టిన అవార్డును అందజేశారు అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
సినిమాల్లోకి రాకముందు ఒకప్పుడు లెక్ఛరర్‌గా పనిచేసేవారు.ఆ సమయంలోనే ఆయన లెవెల్ వేరు. అహనా పెళ్లంటా సినిమాలో ఆయనకు అరగుండు కొట్టించింది నేనే. బట్టలు విడిపించి లాగు, అంగీ తొడిగించింది నేనే. అలాంట వారితో నటించడం గొప్ప అదృష్టం అని అన్నారు.
స:కుటుంబానం సినిమా గురించి చెబుతూ ఇది ఒక అనాథ కథ అని, కుటుంబం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది. తండ్రి పాత్రలో నటించడం తనకు ఒక పెద్ద పరీక్షలాంటిది అని అ్నారు. సహకుటుంబానం సినిమాను థియేటర్లలో చూడాలని, ఆశీర్వదించాలని రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేక్షకులను కోరారు. సినిమా మీద ప్రేమ ఉంటే థియేటర్లలోనే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











