డ్రగ్ కేసు విచారణకు రకుల్ ప్రీత్.. ఎన్సీబీ కార్యాలయంలో హాజరు
బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో దక్షిణ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకొన్నారు. రకుల్ వెంట ఆమె సోదరుడు ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖానికి మాస్క్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ కార్యాలయానికి వెళ్తూ ఆందోళనతో కనిపించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్సీబీ, సీబీఐ, ఈడీకి డ్రగ్స్ రాకెట్ మాఫియా లింకులను గుర్తించారు. దాంతో రియాను విచారించగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటపెట్టడంతో ఆమెకు సమన్లు జారీ చేశారు.

వాస్తవానికి రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 24వ తేదీన డ్రగ్స్ కేసు విచారణకు హాజరుకావాల్సింది. అయితే సమన్లు అందలేవనే కారణంతో ఆమె విచారణకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్సీబీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. దాంతో ఆమె శుక్రవారం విచారణకు హాజరయ్యారు.

బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్లు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ముంబైలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విమానాశ్రాయాల్లో, ఎన్సీబీ కార్యాలయం వద్ద ముంబై పోలీసులను భారీగా నియమించారు.


Click it and Unblock the Notifications











