బ్రేకింగ్: రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్.. పరిస్థితి ఎలా ఉందంటే?
సినిమా ప్రపంచంలో గత కొంత కాలంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ మహమ్మారి సెలబ్రెటీలను వదలడం లేదు. ఎంతో మంది ఈ సారి కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. ఇక మెగా ఫ్యామిలీని కూడా కరోనా వైరస్ తాకడం హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మెగా పవర్ స్టార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

కరోనా పాజిటివ్ అని తేలడంతో..
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆచార్య షూటింగ్ స్పాట్ కి కూడా ఇటీవల వెళ్లిన చరణ్ చాలా బిజీగా కనిపించాడు. అయితే సడన్ గా చరణ్ కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. నేడు ఉదయం సోషల్ మీడియా ద్వారా చరణ్ తనకు కరోనా వచ్చినట్లు వివరణ ఇచ్చారు.

గత కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ కు పాజిటివ్..
కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అనగానే అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ తరువాత వారం రోజులు తిరక్కుండానే మెగాస్టార్ కు నెగిటివ్ రావడం ఊరటనిచ్చింది. మళ్ళీ ఆయన బిజీగా మారడం అభిమానులకు సంతోషాన్ని కూడా ఇచ్చింది. ఇక ఎప్పుడు రామ్ చరణ్ కూడా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. గత రెండు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని రామ్ చరణ్ అభ్యర్థించారు. ఇక చరణ్ జనవరి 11 నుండి చిరంజీవి ఆచార్య సెట్స్‌లో చేరనున్న విషయం తెలిసిందే.
Recommended Video

పరిస్థితి ఎలా ఉందంటే..
రామ్ చరణ్ లక్షణాలతో సంబందం లేకుండా వారానికోసారి కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా నేడు పాజిటివ్ అని తేలడంతో సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక నెగిటివ్ వచ్చే వరకు చరణ్ షూటింగ్స్ కు దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అభిమానులు కూడా చరణ్ వీలైనంత త్వరగా సెట్టవ్వలని, జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











