Boyapati Rapo: ఎరక్కపోయి ఇరుక్కుపోతున్న రామ్.. పరిస్థితి ఏంటో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎరుక్కుపోయి ఇరుక్కుపోయాడనే చెప్పాలి. ఇప్పుడు ఈ హీరో రెండు సీక్వెల్స్ మధ్యన ఇరుక్కుపోయాడు. ఈ వినాయక చవితికి రామ్ పోతినేని బోయపాటి సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే అదే రోజున రెండు సీక్వెల్స్ రాబోతున్నాయి. దీనితో బోయపాటి, రామ్ పరిస్థితి.. సీక్వెల్స్ మధ్య సాండ్ విచ్ లా తయారైంది. ఆ వివరాల్లోకి వెళితే...

సీక్వెల్స్ తో రామ్ పోటీ: రామ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వస్తున్న పాన్ ఇండియ‌న్ మూవీ రిలీజ్ డేట్ మారిన సంగతి తెలిసిందే. అనుకున్న టైమ్‌ కంటే నెల రోజ‌ల‌ ముందుగానే ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు తెలిపారు. దానితో పాటు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే రోజున రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి.

Actor Ram Pothineni Movie Stuck Between Sequels

డీజే టిల్లు ఆరోజూనే: సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్నట్లు ఇటీవల ప్రకటించారు. అనుపమా పరమేశ్వర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

Actor Ram Pothineni Movie Stuck Between Sequels

చంద్రముఖి2తో రాఘవా లారెెన్స్: అయితే తాజాగా ఈ వినాయక చవితికి మరో సీక్వెల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రాఘ‌వా లారెన్స్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. పీ వాసు డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ అప్డేట్ ఇచ్చింది. ఈ వినాయక చవితికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. వినాయక చవితి సెప్టంబర్ నెల 19వ తేదీన ఉంది. అంటే... ఈ సినిమా సెప్టెంబర్ 15న శుక్రవారం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

బాలయ్య కోసం సినిమా ప్రీపోన్: ఈ రెండు సీక్వెల్స్ తో రామ్ పోతినేని మధ్యలో ఇరుక్కున్నాడు. అసలు ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుండగా.. ప్రీపోన్ చేసుకున్నారు. అయితే అక్టోబర్ లో బాలయ్య సినిమా ఉందని.. బోయపాటి, రామ్ ఒంటరిగా వద్దామని.. సెప్టెంబర్ కు ప్రీపోన్ చేసుకుంటే.. అసలుకే ఎసరు వచ్చింది. ఇక ఈ నెలలో రెండు సీక్వెల్స్ రామ్ పోతినేనితో పోటీకి దిగనున్నాయి. ఇక ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

Actor Ram Pothineni Movie Stuck Between Sequels

పాన్ ఇండియా ఎంట్రీ ఈ సినిమాతోనే: బాక్స్ ఆఫీస్ వద్ద సింగిల్ గా వద్దామనుకుంటే... రామ్ కు చుక్కెదురు అయింది. ఆ రెండు సీక్వెల్స్... 50 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం. చూడాలి ఇక ఈ సీక్వెల్స్ తో రామ్ బోయపాటి ఎలా పోటిపడనున్నారు. ఇక ఈ సినిమా రామ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న తొలి సినిమా. బోయ‌పాటి గ‌త సినిమాల త‌ర‌హాలోనే ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాతోనే రామ్ పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఇందులో రామ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యిన‌ట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X