మాస్ హీరోగా రావు రమేష్.. 50 వేల మందితో మారుతినగర్ సుబ్రమణ్యం ఫస్ట్ లుక్.. హిస్టరీ క్రియేట్!
కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు తెలుగు సినిమా రంగంలో హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. గతంలో కైకాల సత్యనారాయణ నుంచి నేటి సునీల్, సప్తగిరి లాంటి వాళ్లు హీరో పాత్రలు వేసి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విలక్షణ నటుడు రావు రమేష్ సినిమాలో లీడ్ పాత్ర చేస్తూ హీరోగా మారారు. ఆ సినిమానే మారుతినగర్ సుబ్రమణ్యం. ఆయన హీరోగా మారి వస్తున్న సినిమా ఫస్ట్‌లుక్ ఓ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఏదైనా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే టాప్ హీరోలను, ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. కానీ మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా హీరో ఫస్ట్ లుక్‌ను ప్రేక్షకుల చేతనే ఆవిష్కరించారు. ఇందు కోసం వినూత్నమైన పద్దతిని అనుసరించి.. తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారు.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో QR Code ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి కోడ్‌ను ఉపయోగించి ప్రేక్షకుల చేత రావు రమేష్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేలా చర్యలు తీసుకొన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. వారి మొబైల్స్‌లో హీరో ఫస్ట్ లుక్ ప్రత్యక్షమైంది. ఆ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రావు రమేష్ ఫస్ట్ లుక్‌లోనే మాస్ అవతారంలో ఆకట్టుకొన్నాడు. గళ్ల షర్ట్.. లుంగీ.. నిక్కర్‌తో మాస్ హీరోకు ఏ మాత్రం తగ్గకుండా ఇరుగదీశాడు. ఆయన మాస్ లుక్ వైరల్ అయింది. రావు రమేష్ హీరోగా నటించిన మారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ఫస్ట్ లుక్ లాంచ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. లక్షల్లో సినీ అభిమానులు ఆయన ఫోటోను స్కాన్ చేసి షేర్ చేశారు. ప్రేక్షకులే అతిథులుగా మారి చేసిన ఫస్ట్ లుక్ లాంచ్ స్పందన చూసి చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా నటుడు రావు రమేష్ మాట్లాడుతూ మూవీ కథ, నా పాత్ర చాలా బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఎవరితో ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చూపించిన అభిమానానికి సదా కృతజ్ఞుడిని అని చెప్పారు.
నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మోహన్ కార్య
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల
లిరిక్స్: చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి,
ఆర్ట్: సురేష్ భీమంగని,
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి,
సినిమాటోగ్రఫి: ఎంఎన్ బాల్ రెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి


Click it and Unblock the Notifications











