హీరోగా ఎంట్రీ ఇస్తున్న రావు రమేష్.. దర్శకుడు ఎవరు?, సినిమా టైటిల్ ఎంటో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి పాత్రలు పోషించిన తనకంటూ ఇమేజ్‌ను ఏర్పరుచుకోవడమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షించే కొందరు ప్రతిభావంతులు ఉంటారు. ఎలాంటి పాత్రను పోషించిన తన ప్రతిభతో కథను ముందుకు తీసుకుపోవడంలో ప్రత్యేకతను కొందరు నటీనటులు ఉంటారు. అలాంటి వారిలో రావు రమేష్ ఒకరంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అలాంటి విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతున్నారు.

ఆయన పోషించబోయేది రెగ్యులర్ హీరో రోల్ కాదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలను ఆదరిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉండబోతోంది.

 Actor Rao Ramesh become lead hero for Maruthi Nagar Subramanyam

రావు రమేష్ టైటిల్ పాత్రలో పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ పుష్ప, కేజియఫ్, ధమాకా తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిది. ఇందులో నటి ఇంద్రజ కీలక పాత్రధారి. హ్యాపీ వెడ్డింగ్ ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజు సినిమాను అధికారికంగా ప్రకటించారు.

చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ.. వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ గారు లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X