twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోదీ జీవితంపై మరో మూవీ.. ప్రధానిపై కన్నేసిన ప్రముఖ విలన్

    |

    ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోదీ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగానే... మరో బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భోజ్‌పురి నటుడు, గోరఖ్‌పూర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రవి కిషన్ భారత ప్రధాని మోదీ బయోపిక్‌ను తెరకెక్కించాలనుకొంటున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి, స్వామి వివేకానంద బయోపిక్‌లను నిర్మించాలనే ఆలోచన కూడా ఉందని మీడియాకు రవికిషన్ వెల్లడించారు.

    నాకు చాలా విభిన్నమైన ప్రాజెక్టులను రూపొందించాలని ఆలోచన ఉంది. త్వరలోనే అధికారికంగా వాటి గురించి మాట్లాడుతాను అని రవి కిషన్ అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల సినిమాలకు దూరంగా కాను. యాక్టర్‌గా కొనసాగుతాను. గోరఖ్‌పూర్‌లో స్టూడియో ఏర్పాటు చేయాలనుకొంటున్నాను. ఓ పక్క ప్రజా సేవ చేస్తూనే మరో పక్క కళామతల్లి సేవలో తరిస్తాను అని రవికిషన్ అన్నారు.

     Actor Ravi Kishan produce PM Narendra Modi biopic in Bhojpuri

    ప్రధాని మోదీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎన్నో విషయాల్లో ఆయన నుంచి స్ఫూర్తి పొందాను. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ టాయిలెట్స్ ఉండాలనే నినాదం తీసుకోవడం నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల వారిని మోదీని పట్టించుకొన్నతగా ఎవరూ పట్టించుకోలేదు అని రవికిషన్ పేర్కొన్నారు.

    బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించగా ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన పీఎం నరేంద్రమోదీ బయోపిక్ విడుదల ఎన్నికల కారణంగా వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల పూర్తయిన తర్వాత మే 24న రిలీజ‌్ అవుతున్నది. ఇప్పటికే పీఎం నరేంద్రమోదీ బయోపిక్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

    English summary
    Actor Ravi Kishan joins in BJP and contesting from Gorakhpur Parliament seat. Ravi Kishan said that he wants make PM Narendra Modi biopic. I have several projects in mind, including Modiji's biopic in Bhojpuri, so that people get to know more about him. Apart from this, I am also planning to make biopics of Swami Vivekananda and Atal Bihari Vajpayee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X