అలా.. నన్ను ట్రోల్ చెయ్యొద్దు ప్లీజ్.. పవన్ కళ్యాణ్ బ్యూటీ సంచలనం
ఇండస్ట్రీలో రోజుకో కొత్త యాక్టర్స్ వస్తూనే ఉంటారు. ఇలాంటి పోటీ ప్రపంచంలో స్టార్ గా నిలదుక్కుకోవడం కష్టమేనని చెప్పాలి. అయితే.. ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించదు. అనుకున్న విధంగా విజయాలు దరిచేరవు. కెరీర్ లో సత్కారాలే కావు.. అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటి.. తనని ట్రోల్ చేయొద్దంటూ నెటిజెన్లను రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఏం జరిగింది? వివరాల్లోకి వెళ్తే
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ల (Ananya Nagalla). అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనపై ఆసక్తితో సాప్ట్ వేర్ జాబ్ వదులుకొని యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది. ఈ తరుణంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. అలాగే.. ఈ షార్ట్ ఫిల్మ్ కు సైమా అవార్డు వచ్చింది. దీంతో అమ్మడుకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ క్రేజ్ తోనే 'మల్లేశం'అనే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ సినిమాలో అనన్య నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఇందులో కూడా అద్బుతంగా నటించి.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వచ్చాయి. అలా 'ప్లేబ్యాక్','మ్యాస్ట్రో', 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం', 'మళ్లీ పెళ్లి', 'తంత్ర', 'డార్లింగ్' అనే సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇలా పలు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతుంది.
ఇటీవల 'పొట్టేల్' అనే సినిమాలో హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. ఇదెలా ఉంటే.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'అనే సినిమాతో ప్రేక్షకుల వచ్చింది.
కామెడీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించగా.. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. డిసెంబర్ 25న విడుదలైన శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ మూవీ అందరినీ అలరిస్తూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ తరుణంలో ఈ మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్బంగా హీరో రవితేజ మహాదాస్యం మాట్లాడుతూ 'అంతకుముందు అనన్య ఇంటర్వ్యూ వీడియోస్ చూసానని అందులో ఆమెను లేడీస్ సూపర్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చారు. ఆ సమయంలో అనన్య తన కొంత సీన్ లేదు అంటూ మాట్లాడింది. ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతుంది అది ఆమె గొప్పతనం. కానీ ఈ సినిమా తర్వాత .. ఆమె నటనను చూసి నాకు చాలా జలస్ వచ్చింది. ఎందుకంటే.. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా గురించి కంటే ఆమె గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి చూస్తే ఆమె త్వరగా నే లేడు సూపర్ స్టార్ అవుతున్నాను. ఈ సినిమా నుండి ఆమె వేరే లెవల్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు రవి తేజ.
ఆ తర్వాత అనన్య మాట్లాడుతూ ఇకపై అలాంటి ట్యాగులు వేసి తనని ట్రోల్ చెయ్యొద్దు అంటూ నేటిజనులను కామెంట్స్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇందులో తాను ఒక డిఫరెంట్ రోల్ లో నటించానని చెప్పుకొచ్చారు.శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాతో పాటు తన పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపారు. ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలు ఒకెత్తు.. ఈ సినిమాలో తాను నటించిన పాత్ర మరో ఎత్తని ప్రశంసించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











