తెలివిగా ప్లాప్ నుంచి తప్పించుకున్న మాస్ రాజా రవితేజ.. ఆ హీరోకు మరో డిజాస్టర్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొంతమంది హీరోలు సెలెక్ట్ చేసుకుంటున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. డిజాస్టర్ వచ్చిన తర్వాత మళ్లీ ఏదో ఒక సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. అలాంటి అతి తక్కువ మంది హీరోల లో రవితేజ కూడా ఉన్నాడు. ఈ ఏడాది రవితేజ అందరి కంటే ముందుగా బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మాస్ మసాలా యాక్షన్ సినిమా క్రాక్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా కేవలం సక్సెస్ అవ్వడమే కాకుండా రవితేజ కెరీర్ లోనే అత్యధిక లాభాలను అందించిన సినిమాగా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

అంతేకాకుండా రవితేజ కూడా ఆ సినిమా ద్వారా దాదాపు 16 కోట్ల వరకు లాభాలను అందుకున్నాడు. ఎందుకంటే రవితేజ ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేశాడు. లాభాలు వచ్చిన తర్వాత వాటాలు తీసుకునే విధంగా డీల్ కూడా సెట్ చేసుకున్నాడు. క్రాక్ సినిమా ద్వారా రవితేజ అన్ని రకాలుగా ఫామ్ లోకి వచ్చాడు అని చెప్పవచ్చు. అయితే ఆ సినిమాతో వచ్చిన ఫలితాన్ని రవితేజ ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అనుకుంటున్నాడు. భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టులు కూడా వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే ఉండాలి అని అనుకుంటున్నాడు. కేవలం కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండడమే కాకుండా సెలెక్ట్ చేసుకునే ప్రతి కథలో కూడా ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు.

Actor Ravi teja rejected raj tarun recent movie

ఖిలాడి సినిమా కూడా సరికొత్త యాక్షన్ సినిమా గా తెరపైకి రాబోతుంది. అయితే ఇటీవల రవితేజ ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నట్లు అర్థమైంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుభవించు రాజా సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రాజ్ తరుణ్ మరోసారి కథల ఎంపిక విషయంలో పొరపాటు చేశాడు. అఖండ సినిమా రావడంతో ప్రస్తుతం ఆ సినిమా హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు. అయితే అనుభవించు రాజా సినిమా దర్శకుడు శ్రీను ఆ కథ కోసం మొదట రవితేజ అనుకున్నాడట. రాజ్ తరుణ్ కాంటె ముందే రవితేజకు అనుభవించు రాజా కథను చెప్పినట్లు సమాచారం. .

కొన్ని రోజుల పాటు ఇద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయట. అయితే కథ లో కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి అని రవితేజ సినిమాలు చేయకుండా మెల్లగా తప్పించుకున్నాడు. అయితే రవితేజ రిజెక్ట్ చేసిన ప్రాజెక్టును రాజ్ తరుణ్ సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం చాలా తొందరగా ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా ఎంతో కొంత బజ్ అయితే క్రియేట్ అయింది. కానీ సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల మనసులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రాజ్ తరుణ్ నుంచి కూడా ప్రేక్షకులు సరికొత్త కథలను కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇంకా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతున్నాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక రవితేజ మొత్తానికి అనుభవించు రాజా కదా నుంచి తప్పించుకోవడమే మంచిదైందని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అలాగే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో పాటు త్రినాధరావు నక్కిన తో కూడా ఒక ప్రాజెక్టును మొదలు పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X