మీ కోసమే ఎదురుచూస్తున్నాం.. వైఎస్ జగన్ గెలుపుపై రవితేజ ట్వీట్..
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సినీ నటులు సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ స్పందిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సాధించిన అఖండ విజయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ స్పందించారు. వైఎస్ జగన్ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు యువ ముఖ్యమంత్రిగా ఎంపికైన వైఎస్ జగన్ గారికి కంగ్రాట్స్. మీ సుపరిపాలన కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. భవిష్యత్‌లో మీకు అంతా మంచి జరుగాలని కోరుకొంటున్నాం అని రవితేజ ట్వీట్ చేశారు.

సినిమా ప్రపంచం తప్ప మరో విషయంపై స్పందించని రవితేజ.. ఏపీ రాజకీయాలపై రియాక్ట్ కావడం, అది కాకుండా వైఎస్ జగన్‌కు ఏకంగా శుభాకాంక్షలు తెలియజేయడం సినీ, రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇక రవితేజ సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రామ్ తాళ్లూరి నిర్మాత. గత కొద్దికాలంగా రవితేజ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డిస్కో రాజాతో మళ్లీ ఫాంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











