Sai Dharam Tej ఇంకా ఐసీయూలోనే.. లైఫ్ సపోర్టుతోనే చికిత్స...
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది సినీ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. ఇక అభిమానులకు మెగా ఫాలోవర్స్ కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అతను త్వరగా కోలుకోవాలని అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ మెగా నటుడు స్థిరమైన స్థితిలో ఉన్నాడు అని అపోలో వైద్యులు మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇంకా ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగయ్యేంత వరకు కూడా ఐసీయూలోనే ఉంచాలని అనుకుంటున్నారట.

ప్రాణాపాయం తప్పింది
శుక్రవారం రాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ లో సాయి ధరమ్ తేజ్ కు కాలర్‌బోన్‌కు ఫ్రాక్చర్ అయ్యింది. అలాగే ఛాతీ మరియు కడుపుపై కూడా గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దీ సేపటికే హాస్పిటల్ కు తీసుకు రావడం వలన పెను ప్రమాదం తప్పిందని వైద్యులు ఇదివరకే వివరణ ఇచ్చారు. ఇక మొదటి రోజు నుంచి కూడా అపోలో వైద్యులు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కంగారు పడాల్సిన అవసరం లేదు
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై కూడా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వైద్యులకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇక అభిమానులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని మొదటిరోజు నుంచి కూడా అపోలో వైద్యులు హెల్త్ విషయంపై అప్డేట్స్ ఇస్తున్నారు. తప్పకుండా సాయి త్వరగానే కొలుకుంటారని కూడా అన్నారు.

ఐసియూలోనే.. లైఫ్ సపోర్ట్
హీరో సాయిధరమ్ తేజ్ సర్జరీ సక్సెస్ అయ్యిందని కూడా తెలియజేశారు. కాలర్ బోన్‌కు చికిత్స చేసిన వైద్యులు మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని ఆదివారం తెలియజేశారు ఇక కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అంటూ.. అయితే ఆరోగ్యం ఇంకాస్త కుదుటపడే వరకు కూడా ఐసియూలోనే లైఫ్ సపోర్ట్ తోనే చికిత్స అంధించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండాశ్వాస తీసుకోవడం కొంత మెరుగైందని అన్నారు.

హాస్పిటల్ కు సెలబ్రెటీలు
మొదటి రోజు నుంచి కూడా ఐసీయులో సాయిధరమ్ తేజ్ కు చికిత్స అందిస్తున్న వైద్యులు మరొక 30 గంటలపాటు అబ్జర్వేషన్‌లో పెట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ డాక్టర్స్ ఎప్పటికప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో మెగా కుటుంబంతో కూడా మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు చాలామంది సెలబ్రెటీలు హాస్పిటల్ కు కూడా వచ్చారు. వీలైనంత త్వరగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంగా మన ముందుకు రావాలని స్టార్ సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
Recommended Video

అభిమానుల పూజలు..
మెగా అభిమానులు కూడా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగు పడాలని ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. కొందరు అయితే తమ అభిమాన హీరో కోలుకోవాలని తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లడం విశేషం. ఇక సాయి ధరమ్ తేజ్ తదుపరి సినిమా రిపబ్లిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











