twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naga Chaitanya శోభితా ధూళిపాల అఫైర్‌పై సమంత ట్వీట్.. చైతూ ఫ్యాన్స్‌కు కౌంటర్!

    |

    యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని డేటింగ్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత రుత్ ప్రభుతో విడాకుల తర్వాత మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించిన శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వెబ్ మీడియాలో గుప్పుమన్నాయి. చైతూ, శోభితా వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే చైతూ డేటింగ్ వ్యవహారంపై సమంత ఘాటుగా స్పందించడంతో ఈ వార్త మరోసారి మరింత హాట్ టాపిక్‌గా మారింది. సమంత చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..

    నాగచైతన్యకు హీరోయిన్లతో లింకు

    నాగచైతన్యకు హీరోయిన్లతో లింకు

    సమంత రుత్ ప్రభుతో డైవోర్స్ తర్వాత నాగచైతన్యకు కొంత మంది హీరోయిన్లకు లింక్ పెడుతూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ శోభితా ధూళిపాలతో రొమాంటిక్ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్నది. అయితే చైతూ, శోభిత రిలేషన్‌షిప్ గురించి సమంత నర్మగర్భంగా చేసిన ట్వీట్ కాకపుట్టించింది.

    సమంత పీఆర్ టీమ్ పనే అంటూ

    సమంత పీఆర్ టీమ్ పనే అంటూ


    అయితే నాగచైతన్య, శోభితా ధూళిపాల అఫైర్ వ్యవహారం సమంత పీఆర్ టీమ్ పనే... ఆమె కారణంగానే ఇలాంటి రూమర్లు మీడియాలో వస్తున్నాయి. సమంత పీఆర్ టీమ్ చేస్తున్న పని సరికాదు అంటూ చైతన్య ఫాన్య్ సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. సమంత టీమ్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ట్వీట్‌కు సమంత సమాధానం ఘాటుగానే ఇచ్చింది.

    సమంత చేసిన ట్వీట్ ఇదే..

    సమంత తన ట్వీట్‌లో అమ్మాయిపై వస్తున్న రూమర్లలో కచ్చితంగా వాస్తవం ఉండొచ్చు. అబ్బాయిపై రూమర్లు.. ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగా చేసినవు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా.. నా పీఆర్ టీమ్‌ను తప్పుపట్టడం సరికాదు. మీరు ఇంకా చాలా ఎదగాలి. వాస్తవాలు తెలుసుకోండి. ఈ రూమర్ల వెనుక చాలా పార్టీలు జోరుగా పనిచేస్తున్నాయి. మీరు కూడా అదే స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలి. మీ ఫ్యామిలీ మీద.. మీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేసి.. అసలు విషయం తెలుసుకోండి అంటూ సమంత ఘాటుగా ట్వీట్ చేసింది.

    నాగచైతన్యపై వార్ ప్రకటించిందా?

    నాగచైతన్యపై వార్ ప్రకటించిందా?


    అయితే సమంత ట్వీట్, నాగచైతన్య, శోభిత అఫైర్ గురించి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. విడాకుల తర్వాత 9 నెలలకు సమంత నాగచైతన్యపై వార్ ప్రకటించిందా? సరైన ఆధారాలు, సమయం కోసం వేచి ఉన్న సమంతకు ఈ వార్త ఆయుధంగా మారి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    నాగచైతన్యపై నెగిటివ్ వార్తలు

    నాగచైతన్యపై నెగిటివ్ వార్తలు

    పీఆర్ టీమ్ పెయిడ్ వార్తలతో విసుగు పుడుతున్నది. నాగచైతన్యపై నెగిటివ్ వార్తలను ప్రమోట్ చేయడం సరికాదు. అయితే ఆయన మాజీ భార్యను ప్రతీ సోషల్ మీడియా పోస్టులో ప్రమోట్ చేస్తున్నారు. నాగచైతన్య సెన్సిబుల్ పర్సన్. అతడిపై ఇలాంటి రూమర్లు ప్రచారం చేయకండి అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

    సమంతను టార్గెట్ చేయొద్దు

    సమంతను నాగచైతన్య ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ఆపండి.. నాగచైతన్యను చూస్తే నాకు అసహ్యం వేస్తున్నది. మీ హీరోను మంచి పనులు చేయమని చెప్పండి.. ఇలా ఓ మహిళ పేరును ఇలా దుర్వినియోగం చేయకండి.. ఫ్యాన్స్ చర్యలతో సిగ్గుపడుతున్నాను అని ఓ నెటిజన్ ట్వీట్ చేసింది.

    English summary
    Samantha Ruth Prabhu reacted on Naga Chaitanya, Sobhita Dhulipala romantic relationship. She tweeted that, Rumours on girl - Must be true !! Rumours on boy - Planted by girl !! Grow up guys .. Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X