Acharya సినిమాలో మరో యువ హీరో స్పెషల్ రోల్.. విడుదలకు ముందే మెగాస్టార్ లీక్!
మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఆచార్య సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ హిట్ అందుకుంటుంది అని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే క్లారిటీ వచ్చేసింది. కొణిదెల ప్రొడక్షన్స్ లో మ్యాట్ని మూవీస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఒక టాలెంట్ యువ హీరో కూడా ప్రత్యేకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా లో అందుకు సంబంధించిన విషయాన్ని కూడా తెలియజేశారు. వివరాల్లోకి వెళితే..

ధర్మకోసం పోరాటం
మంచి సందేశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ ఈసారి టాలీవుడ్ మెగా హీరోలతో ఒక డిఫరెంట్ యాక్షన్ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ధర్మం కోసం పాటుపడే ఇద్దరు నక్సలైట్లు ఎలాంటి అనుభవాలతో ముందుకు వెళ్లారు అలాగే వారికి ఎదురైన అతి పెద్ద సమస్య ఏమిటి ఆ తర్వాత కలిసి ఎలా పోరాడారు అనే అంశం కూడా ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు సమాచారం.

సెకండ్ హాఫ్ లో..
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రేక్షకుల్లో అంచనాలు స్థాయిని పెంచాయి. సినిమాలో రామ్ చరణ్ తేజ్ పాత్ర సెకండ్ ఆఫ్ లో ఉంటుంది అని క్లారిటీగా చెప్పేశారు. మొదట రామ్ చరణ్ ను 15 నిమిషాల్లో అతిథి పాత్ర కోసమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత దర్శకుడు ఆ పాత్ర నిడివిని పెంచి మొత్తం 40 నిమిషాల పాటు సినిమాలో పొందుపరచడం విశేషం.

మరో యువ హీరో
అయితే ఈ సినిమాలో మరొక యువ హీరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ విషయాన్ని ఆ హీరో సోషల్ మీడియా ద్వారా తెలియజేయగా మెగాస్టార్ చిరంజీవి కూడా అతనితో దిగిన ఒక ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా అతన్ని అభినందించారు. ఇక ఆ యువ హీరో మరెవరో కాదు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యాక్టర్ సత్యదేవ్.

ఆచార్యలో..
గత కొంతకాలంగా విభిన్నమైన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరో గా నటుడిగా మంచి గుర్తింపు అందుకుంటున్న సత్య అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో కూడా స్పెషల్ పాత్రలలో కూడా కనిపిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా అతను ఒక మంచి క్యారెక్టర్ లో నటించినట్లు తెలుస్తుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఈ విధంగా తెలియజేశాడు.
అదృష్టం కలిగింది..
అన్నయ్యా, నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది... అని సత్యదేవ్ తెలియజేశారు.
Recommended Video


అభిమాని కావడం చాలా సంతోషం..
సత్యదేవ్ ట్వీట్ కు మెగాస్టార్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. డియర్ సత్యదేవ్.. థాంక్యూ..
నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. ఆచార్య లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం.. గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం.. అని చిరంజీవి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











