ప్యాన్ ఇండియా మూవీలో నిత్య మీనన్.. శర్వానంద్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న గమనం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజన రావు తొలిసారి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నిత్యమీనన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను యువ హీరో శర్వానంద్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో శైలాపుత్రి దేవి అనే గాయకురాలి పాత్రలో నిత్య మీనన్ కనిపిస్తున్నారు. తాజా పోస్టర్‌లో చెరగని నవ్వుతో దైవత్వం మూర్తిభవించిన సాంప్రదాయ మహిళ పాత్రను ఆమె పోషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గమనం చిత్రానికి సంబంధించిన శ్రీయ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నిత్య మీనన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.

గమనం చిత్రానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి షూటింగు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం వహించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

నటీనటులు: శ్రీయా సరన్, నిత్య మీనన్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సుజానా రావు
నిర్మాతలు: రమేష్ కర్తూరి, వెంకి పుషదపు, గుణశేఖర్ వీఎస్
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
డీవోపీ: గుణశేఖర్ వీఎస్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఎడిటర్: రామకృష్ణ అర్రం


Click it and Unblock the Notifications











