'నాకు జీవితంలో పెళ్లి జరగదనుకున్నా.. కానీ ఆమెతో అలా'
అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ పరిశ్రమలోనూ నటీనటులు ఒకొరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఉదంతాలెన్నో. సహ నటులను , టెక్నీషియన్లను పెళ్లాడిన వారు ఎందరో. మన తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికే వస్తే.. సూపర్‌స్టార్ కృష్ణ - విజయ నిర్మల, మహేశ్ బాబు - నమ్రత శిరోద్కర్, పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్, నాగార్జున - అమల, సమంత - నాగచైతన్య, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, కృష్ణవంశీ - రమ్యకృష్ణ, శ్రీకాంత్ - ఊహ తదితరులు తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లి.. సక్సెస్‌ఫుల్‌గా ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.
ఈ కోవలోకే వస్తారు శివ బాలాజీ - మధుమిత. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలాజీ.. తొలుత హీరోగా నటించినా తర్వాత క్యారెక్టర్ రోల్స్‌లోకి మారిపోయారు. ఆర్య, సంక్రాంతి, అన్నవరం, చందమామ, శంభో శివ శంభో, కాటమరాయుడు సినిమాలు ఆయనకు పేరు తీసుకొచ్చాయి. తెలుగులో ప్రసారమైన బిగ్‌బాస్ తొలి సీజన్ విజేతగా నిలిచి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌లోనూ తన సత్తా చాటుతున్నారు శివబాలాజీ.

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివబాలాజీ మాట్లాడుతూ.. తన ప్రేమకథ, పెళ్లి విషయంలో అయిన గొడవల గురించి వివరించారు. శివబాలాజీ , మధుమితలు ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో బాగా దగ్గరయ్యారు. చిన్నప్పటి నుంచి తనకు ఎలాంటి భార్య కావాలో కొన్ని అనుకున్నానని.. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మధులో ఉన్నాయని తెలిపారు. వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి చివరికి 2009లో పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. అయితే అంత తేలిగ్గా వీరి లవ్‌స్టోరీకి శుభం కార్డ్ పడలేదట.. సినిమాలో ఎన్ని ట్విస్టులుంటాయో అన్ని వీరి ప్రేమకథలోనూ కనిపించాయట. ప్రపోజ్ అనగానే ఐ లవ్ యూ అని కాకుండా.. ఏకంగా పెళ్లి చేసుకుందామని మధుమితతో ప్రతిపాదన తీసుకొచ్చారట శివబాలాజీ.
అయితే శివబాలాజీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు జాతకాలపై నమ్మకం ఎక్కువ. ఆ సమయంలో నాది, మధుమితతో జాతకాలు చూసి ఇద్దరికి సెట్ అవ్వదని చెప్పారని.. పైగా ఆమెతో పెళ్లయితే శివబాలాజీ తల్లికి ప్రాణగండమట. ఇదే విషయం మధుకి చెప్పగా, ఆమెకు కోపం వచ్చి దాదాపు ఏడాదిన్నర పాటు మాట్లాడుకోలేదట. తర్వాత మధుమిత అసిస్టెంట్ ద్వారా ఆమె ఏం చేస్తుంది, ఎక్కడుంది తెలుసుకుని ఆమెను కలవగా.. నా లైఫ్‌లోంచి వెళ్లిపోయావు కదా, మళ్లి ఎందుకు వచ్చావని మెసేజ్ పెట్టిందని శివబాలాజీ చెప్పారు.

జీవితంలో ఇంకెప్పుడూ నిన్ను వదిలిపెట్టనని చెప్పి ఆమెకు తిరిగి దగ్గరయ్యానని తెలిపారు. తాను వచ్చిన ప్రతి సంబంధాన్ని రిజెక్ట్ చేస్తూ ఉండటంతో ఇంట్లో వాళ్లు అర్ధం చేసుకుని ఎట్టకేలకు మధుమితతో పెళ్లికి ఓకే చెప్పారని శివబాలాజీ చెప్పారు. ఆ తర్వాత జాతకాలు చూపించగా కలిశాయని .. కానీ మధు తల్లి మాత్రం నాకు కోపం ఎక్కువని నో చెప్పారని వెల్లడించారు. మధుమిత గట్టిగా ప్రయత్నించి ఇంట్లో వాళ్లని ఒప్పించడంతో మా పెళ్లి జరిగిందని శివబాలాజీ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











