ఆ 13 ఏళ్లు జీవితం తలకిందులు.. ఆ కోరికతోనే మళ్ళీ సినిమాల్లోకి వచ్చా..

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివాజీ (Sivaji). ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించారు. అయితే.. హీరో శివాజీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో రాజకీయాలు, వ్యక్తిగత కారణాలు కలిసి ఆయనను సినీ పరిశ్రమకు దూరమయ్యారు. చాలా గ్యాప్ తరువాత ప్రేక్షకులకు కనించారు.

ఆ సమయంలో బిగ్ బాస్ (Bigg Boss) ఆయన కెరీర్ ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. తిరిగి రీఎంట్రీ ఇచ్చిన శివాజీ..90's వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు. ఆ తరువాత కోర్టు, దండోరా సినిమాల్లో నటించి, మెప్పించారు. తాజాగా తన కెరీర్‌లో వచ్చిన భారీ గ్యాప్‌పై ఓపెన్‌గా మాట్లాడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Actor Sivaji Opens Up on 13-Year Career Gap Bigg Boss Comeback and New Goals

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో శివాజీ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో వచ్చిన భారీ గ్యాప్‌కు స్పష్టమైన కారణం తనకూ తెలియదని, అది పూర్తిగా విధి అని భావిస్తున్నానని చెప్పారు. "నా జీవితంలో ఆ గ్యాప్ ఒక పరీక్షలా మారింది. ఆ సమయంలో జీవితం నాకు సహనం అనే గొప్ప గుణాన్ని నేర్పింది" అని ఆయన అన్నారు. ఆ పదేళ్ల కాలం ఎంతో విలువైనదని పేర్కొన్న శివాజీ, అదే సమయంలో తాను కష్టపడి ఉంటే కమర్షియల్ హీరోగా మరో స్థాయికి వెళ్లి ఉండేవాడినని అంగీకరించారు. "నా కెరీర్ పూర్తిగా మారిపోయే అవకాశముంది. కానీ ఇప్పుడు గతాన్ని గుర్తుచేసుకుని బాధపడడం అవసరం లేదు. ఆ సమయంలో జరిగిన విషయాలను విశ్లేషించుకొని, భవిష్యత్తులో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడమే నా లక్ష్యం" అని వివరించారు. తన చేతుల్లో ఉన్నది కేవలం భవిష్యత్తే అని స్పష్టం చేశారు.

సినిమాలకు దూరం కావడానికి ప్రత్యేక కారణం ఏదీ లేదని చెబుతూ, "ఎలా తెలియకుండా సినిమాలకు దూరమయ్యానో, అలాగే తెలియకుండానే మళ్లీ సినిమాల్లోకి వచ్చాను" అని అన్నారు. 13 ఏళ్ల గ్యాప్ ఒక వ్యక్తి జీవితం తలకిందులు అయ్యే సమయం, పూర్తిగా మార్చేసేంత పెద్ద సమయం అని, కానీ ఆ సమయంలో కూడా తన ఆశయాన్ని మాత్రం కోల్పోలేదని చెప్పారు. 'నా జీవితంలో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ సాధించకుండా హీరోగా చనిపోను. ఆ కోరికే నన్ను తిరిగి సినిమాల్లోకి తీసుకువచ్చింది. అప్పుడూ అదే నమ్మకం, ఇప్పుడూ అదే నమ్మకం' అంటూ తన పట్టుదలను వ్యక్తం చేశారు.

అవకాశాల విషయంలో తన ధోరణి గురించి కూడా శివాజీ ఆసక్తికరంగా మాట్లాడారు. 'అవకాశాలు తగ్గుతున్నా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్లి అడగలేదు. అడగాలనిపించినా ఏదో తెలియని ఫీలింగ్ అడ్డుకొనేది. నాకు దగ్గరగా ఉన్న ముగ్గురు, నలుగురిని మాత్రమే సంప్రదించేవాడిని. మిగతా సమయాల్లో 'నా టైం వస్తుంది' అన్న నమ్మకంతో సైలెంట్‌గా ఉండేవాడిని' అని చెప్పారు. అలా దాదాపు 13 సంవత్సరాలు సహనంతో ఎదురుచూసి మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చానని తెలిపారు. ఆ కాలమే తన సహనాన్ని తీవ్రంగా పరీక్షించిందని అన్నారు.

సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో తాను రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తూ జీవితం గడిపానని వెల్లడించారు. అలాగే రాజకీయాల్లోకి రావడం వెనుక డబ్బు సంపాదన లక్ష్యం కాదని, సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే కోరికతోనే ఆ దిశగా అడుగులు వేసానని చెప్పారు. "ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది. దానికి ప్రతిఫలంగా ఏదైనా చేయాలనిపించింది. డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడూ లేదు" అని ముక్కుసూటిగా వెల్లడించారు.

తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ ఎవరిని ఏదీ ఆశించలేదు. భవిష్యత్తులో కూడా ఎవరిని అడగను. అదృష్టం ఉంటే అవకాశాలు నా దగ్గరికి వస్తాయి. నా నిజాయితీని గుర్తించి వచ్చినదే నాకు సొంతం" అని తనదైన ధైర్యవంతమైన శైలిలో సమాధానం ఇచ్చారు. శివాజీ చెప్పిన ఈ వ్యాఖ్యలు ఆయన జీవితంలో వచ్చిన ఎత్తుపల్లాలను, వాటిని ఎదుర్కొన్న తీరు, తనలోని పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రస్తుతం హీరో శివాజీ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X