నటుడు శివాజీరాజాకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శివాజీరాజా మంగళవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నారు. ప్రస్తుతం శివాజీ రాజా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Recommended Video

Actor Shivaji Raja Hospitalised with Heart $troke
గురువారం అస్వస్థతకు గురై

గురువారం అస్వస్థతకు గురై

కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తూ సినీ కార్మికుల సేవలో నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఎక్కువ భాగం ఇంటికే పరిమితమై సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. గత కొద్దిరోజులుగా అవిశ్రాంతంగా సమాజసేవతోపాటు, సినీ కార్మికులను ఆదుకొనేందుకు తన వంతుగా సహాయం అందించారు. ఇటీవల తన ఫాంలో పండించిన కూరగాయలు, పండ్లను పంచిపెట్టారు. పలు రకాల పని ఒత్తిడులతో అస్వస్థతకు గురయ్యారు.

ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలింపు

ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలింపు

శివాజీ రాజా గురువారం సాయంత్రం నుంచి ఆరోగ్యం కొంత క్షీణించడం, తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటంతో వెంటనే హైదరాబాద్‌లో ప్రముఖ హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే ఆయనను పరీక్షించిన వైద్యులు సకాలంలో చికిత్స అందించారు. దాంతో ఆయన ఆరోగ్యం వెంటనే కుదుటపడిందని తెలిసింది.

బీపీ డౌన్ వల్ల గుండెపోటు

బీపీ డౌన్ వల్ల గుండెపోటు

శివాజీ రాజా ఆరోగ్యంపై సినీ జర్నలిస్టు, నిర్మాత సురేష్ కొండేటి స్పందిస్తూ.. శివాజీ రాజా ఆరోగ్యం బాగుంది. ఇప్పుడే ఆయనతో మాట్లాడాను. గురువారం సాయంత్రం అనుకోకుండా బీపీ డౌన్ అయింది. దాంతో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో హస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడకూడదు అని తెలిపారు.

ఆరోగ్యం సహకరిస్తే గుండెలో స్టంట్ వేస్తాం..

ఆరోగ్యం సహకరిస్తే గుండెలో స్టంట్ వేస్తాం..

ప్రస్తుతం శివాజీ రాజా మరో 24 గంటలపాటు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. బుధవారం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తే శివాజీ రాజాకు గురువారం గుండెలో స్టంట్ వేస్తారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని సురేష్ కొండేటి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X