‘పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం .. ఆ హీరోయిన్ కారణంగా నీ సంగతి చూస్తానని వార్నింగ్’
ఏ రంగంలో ఉన్న ఇద్దరి మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు సహజం. ఇవి కొందరికి వారి జీవితాల్లో చిచ్చుపెట్టి ఇద్దరి మధ్య దూరం పెంచుతాయి. ఈ ఘటనను మనసులో పెట్టుకుని రోజుల తరబడి మాట్లాడుకోని వారు మన చుట్టూ ఎందరో. ఇక చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎదుటి వ్యక్తి ఎదుగుతుంటే ఓర్వలేనివారు ఎందరో. అయితే తమ సన్నహితులను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు కూడా అక్కడకక్కడా లేకపోలేదు.
పవన్ మంచితనం, సాయపడే గుణం గురించి చాలా మంది చెప్పారు. ఇండస్ట్రీలో ఆయన గురించి చెడుగా మాట్లాడేవారు కూడా తక్కువే. అలాంటిది మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు శివాజీ రాజా. తనను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కానివ్వనని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు.

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా మాట్లాడుతూ.. మీ టూ ఉద్యమం జరుగుతున్న సమయంలో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు చేసిందన్నారు. అక్కడితో ఆగకుండా ఫిలిం ఛాంబర్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నానా రచ్చ చేసిందని శివాజీ రాజా అన్నారు. ఆ సమయంలో మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా'కు తానే అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తుచేశారు.
శ్రీరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఓ రోజు పవన్ కళ్యాణ్ 'మా' ఆఫీస్‌కు వచ్చారని.. ఆ సమయంలో నేను, నాగశౌర్య నర్తనశాల షూటింగ్‌లో ఉన్నామన్నారు. ఇంతలో మా ఆఫీస్ వద్దకు రమ్మంటూ పవన్ పిలిపించారని .. తాను అక్కడికి వెళ్లేసరికే పవన్ కోపంతో ఊగిపోతున్నారని, అలా ఆయనను ఎప్పుడూ చూడలేదని శివాజీ రాజా అన్నారు.
నాకు అన్యాయం జరిగింది ఎవరు సమాధానం చెబుతారు.. రాఘవేంద్రరావుకు, సురేష్ బాబుకి ఫోన్ చేయ్ అని చెప్పారని.. అయితే వారిద్దరూ అందుబాటులో లేరని ఆయనకి చెప్పానని.. ఆ వెంటనే నువ్వు ఈసారి మా ప్రెసిడెంట్ ఎలా అవుతావో చూస్తానని పవన్ కళ్యాణ్ నాకు వార్నింగ్ ఇచ్చారని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత పవన్ 20 మంది లాయర్లను తీసుకొచ్చాడని.. కొందరితో కలిసి ఐజీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశానని అది చెప్పినా వినే పరిస్ధితుల్లో పవన్ కళ్యాణ్ లేరని శివాజీ తెలిపారు. ఇంత చేసినా నువ్వు నాకోసం ఏం చేశావని పవన్ కళ్యాణ్ నిలదీయడం నన్ను బాధపెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ గొడవ నేపథ్యంలో నాగబాబు కూడా తనతో మాట్లాడటం మానేశారని, మా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు రాజశేఖర్‌ను కలిశాడని శివాజీ చెప్పారు. తాను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే డ్రగ్స్ కేసులు టాలీవుడ్‌ను చుట్టుముట్టాయని.. ఇంకెవరైనా అయ్యుంటే వదిలేస్తారు, తాను మాత్రం వదిలిపెట్టలేదని తెలిపారు. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత విష్ చేయడానికి వెళ్లి.. పేద కళాకారులను బాగా చూసుకోమని చెప్పానని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











