హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్.. సామాన్లు కనపడేలా అంటూ..

Actor Sivaji: బుల్లితెర నుంచి తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నటుడు శివాజీ. అంచలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అగ్ర కథానాయకుల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ హీరో స్థాయికి చేరుకున్నారు. నటనతో పాటు, రాజకీయాలు-సమాజంపై నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం శివాజీ నైజం. నచ్చినా నచ్చకపోయినా తనకు అనిపించినది కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం వల్ల తరచూ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

హీరో శివాజీ బిగ్ బాస్ షో తిరిగి ఫామ్ లోకి వచ్చారు. కోర్టు సినిమాలో విలన్ పాత్రతో మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇటు వెండి తెర, అటు బుల్లితెరపై నటిస్తూ.. వరుస సినిమాలు, షోలతో బిజీగా మారారు. ఇటీవల ఆయన కీలక పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ 'దండోరా' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జరిగిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Actor Sivaji s Shocking Comments on Heroines Dressing Style Go Viral

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. 'గ్లామర్ పేరుతో హద్దులు దాటొద్దు. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకునే దుస్తుల్లోనో ఉంటుంది. కానీ, సామాన్లు కనిపించేదాంట్లో కాదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్లు వేదికలపై పద్ధతిగా ఉండాలని సూచించిన శివాజీ..స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, హద్దులు దాటిన డ్రెస్సింగ్‌పై అసహనం వ్యక్తం చేశారు.

'అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు బయటికి నవ్వుతూ బాగున్నారు అంటారు కానీ, లోపల మాత్రం ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంది. దారిద్రపు .., కాస్త మంచివి వేసుకుంటే ఇంకా బాగుంటుందికదా అని అనిపిస్తుంది'అన్నారు. అయితే అలా మాట్లాడలేని పరిస్థితి ఉందని, మాట్లాడితే వెంటనే స్త్రీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అంటూ ఉద్యమాలు మొదలవుతాయని వ్యాఖ్యానించారు. 'స్త్రీ అంటేనే ప్రకృతి అందం. ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. స్త్రీ అంటే..అమ్మకు ప్రతిరూపం.. ఎప్పటికీ నా గుండెల్లో కనిపిస్తూనే ఉంటుంది'అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా పాతతరం నటీమణులను గుర్తు చేస్తూ.. సావిత్రి, సౌందర్య వంటి మహానటులు ఇప్పటికీ గుర్తుండిపోవడానికి కారణం వారి పద్ధతి, నటన, గౌరవమేనని అన్నారు. 'గ్లామర్ ఉండాలి కానీ, ఒక లిమిట్ వరకే. గౌరవం మన వేషభాష నుంచే వస్తుంది'అని స్పష్టం చేశారు. ప్రపంచ వేదికలపై కూడా చీర కట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయని పేర్కొంటూ, సంప్రదాయ దుస్తుల గొప్పతనాన్ని శివాజీ హైలైట్ చేశారు.

అయితే.. హీరో శివాజీ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కావడంతో చర్చనీయంగా మారాయి. కొందరూ శివాజీ మాటల్లో నిజం ఉందని, భారతీయ విలువలను గుర్తు చేశారని మద్దతు ఇస్తే, మరో కొందరూ మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తీవ్రంగా విమర్శిస్తోంది. అయితే.. శివాజీ మాటలు సమాజాన్ని ఆలోచింపజేస్తాయా? లేక కొత్త వివాదాలకు దారి తీస్తాయా? అన్నది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: Bigg Boss Telugu 9 sivaji dandora
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X