రియల్ హీరో ఈజ్ బ్యాక్...సోనూ సూద్ కి కరోనా నెగిటివ్

కరోనా వైరస్ బారిన పడిన రియల్ హీరో సోనూసూద్ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు కరోనా నెగటివ్ వచ్చిందని ఆయన కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేశారు. ఈనెల 17వ తేదీన తనకు కరోనా సోకింది అంటూ సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా వారం రోజుల్లో ఆయన కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం తనకు కరోనా సోకిందని ప్రకటించిన సోనూసూద్ తాను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను అని ట్వీట్ చేశారు.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తన ఇంట్లోనే ఉంటున్నానని తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులను కోరారు..

మీ సమస్యలను తీర్చడానికి ఈ విధంగా తనకు సమయం దొరికిందని మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి కూడా సోనూసూద్ దేశంలో ప్రధాన సమస్యగా మారిన ఆక్సిజన్ సిలిండర్లు అలాగే రెమిడిసివిర్ ఇంజెక్షన్ల విషయంలో తన పలుకుబడిని ఉపయోగించి వీలైనన్ని సేకరించి అవసరమైన చోట సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్ కు నాగపూర్ నుంచి ఒక స్పెషల్ ఎయిర్ అంబులెన్స్ లో ఒక కరోనా రోగిని కూడా స్పెషల్ ట్రీట్మెంట్ నిమిత్తం పంపారు కూడా.

Actor Sonu Sood Recovers from Corona

కొద్దిసేపటి క్రితమే తనకు కరోనా నెగిటివ్ అని తేలిందని సోనూసూద్ ట్విట్టర్లో ప్రకటించారు.. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సోనూసూద్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కరోనా సోకడానికి ముందు కూడా ఆయన హైదరాబాద్ లో ఆచార్య షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు కరోనా సోకింది అన్న విషయం వెలుగులోకి రాలేదు. షూటింగ్ ముగించుకుని ఆయన ముంబైలోని తన నివాసానికి వెళ్లిన అనంతరం టెస్ట్ చేయించుకోగా అప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. సరిగ్గా వారం రోజులకు మళ్లీ ఆయన ట్విట్టర్ వేదికగా కోలుకున్నానని ప్రకటించారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X