కరోనా బారిన పడిన సోనూసూద్.. అయినా కూడా వెనక్కి తగ్గకుండా
బాలీవుడ్ సీనియర్ టాలెంటెడ్ యాక్టర్ సోనూసూద్ కూడా కరోనా భారిన పడ్డాడు. గత ఏడాది నుంచి కోవిడ్ వలన కష్టలను ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచిన సోనూసూద్ నిర్విరామంగా తన సహాయలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన కోవిడ్ భారిన పడటం అందరిని షాక్ కు గురి చేసింది.
Recommended Video
నటుడు వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ ప్రముఖులు.. కన్నీరుమున్నీరైన అభిమానులు

ఉదయం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో
సోషల్ మీడియా ద్వారా సోనూసూద్ ఈ విషయాన్ని తెలియజేశాడు. కరోనా వచ్చినా కూడా తాను చేయాల్సిన సహాయలు కూడా కొనసాగుతూనే ఉంటాయని అన్నాడు. ఈ ఉదయం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నాకు పాజిటివ్ అని వచ్చింది. ఇక బాధ్యత ప్రకారం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని అన్నారు.

వెనుకడుగు వేయను.
నా సొంతంగానే క్వారంటైన్ లోకి వెళ్లడం జరిగింది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సమస్యలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయను. ఆ పనులు కొనసాగుతూనే ఉంటాయి.. అంటూ సోనూసూద్ వివరణ ఇచ్చారు.

అందరికి సహాయం చేయడానికి..
ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎక్కువవుతున్న తరుణంలో సోనూసూద్ కు ప్రతిరోజు వేలల్లో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీలైనంత వరకు అందరికి సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సోనుసూద్ వివరణ ఇచ్చారు. కంగారు పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సోనూసూద్ సూచనలు కూడా ఇచ్చారు.

ఆచార్య సినిమాలో
ఇక ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు పలు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా ఆచార్య సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్, సోనూసూద్ కాంబినేషన్ లో దర్శకుడు కొరటాల శివ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించాడు. అందుకు సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యింది.


Click it and Unblock the Notifications











