మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు.. కన్నప్ప ట్రోలింగ్ వివాదంలో కొత్త ట్విస్ట్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీతో పాటు యువతను ఆకట్టుకునే సినిమా చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. తన కామెడీతో ఆడియెన్స్ ను ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం తన చిత్రాలతో భారీ హిట్ అందుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. చివరిగా శ్రీవిష్ణు చివరిగా ఓం భీం భుష్, స్వాగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేక్షకుల నుంచి కాస్తా పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.

ఇక ప్రస్తుతం శ్రీవిష్ణు తన నెక్ట్స్ మూవీ '#సింగిల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మరియు కల్యా ఫిల్మ్స్ బ్యానర్లను సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పించగా.. విద్య కొప్పినీడి, బాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన యంగ్ బ్యూటీ కేతికా శర్మ, ఇవానా నటించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు.

Actor Sri Vishnu Apologizes to Manchu Vishnu Here s the Video

ఈ చిత్రం మే9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. సినిమాకు హై రీచ్ వచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఫన్ ఫిల్డ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. శ్రీవిష్ణు ప్రామీసింగ్ కామెడీ, వెన్నెల కిషోర్ ఫన్, కేతికా శర్మ, ఇవానా బ్యూటీఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ కనిపిస్తోంది. ఇక సింగిల్స్ కోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేసినట్టు గా కనిపిస్తోంది.

అయితే, ఈ ట్రైలర్ తో శ్రీ విష్ణు చిక్కులు పడ్డారు. బాలకృష్ణ, మంచు విష్ణు లాంటి స్టార్స్ అభిమానుల నుంచి విమర్శలను ఎదర్కొంటున్నారు. దీంతో దెబ్బకు శ్రీవిష్ణు స్పందించి వారికి క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీమ్ ను క్షమాపణ కోరుతూ వీడియోను విడుదల చేశారు. మేం ఎవ్వరినీ ఉద్దేశించి డైలాగ్స్ వాడలేదు. ఏదేమైనా కన్నప్పలోని శివయ్య డైలాగ్ రెఫరెన్స్ తీసుకున్నందుకు ఆ టీమ్ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అందుకు మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాం... అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, శ్రీవిష్ణు రాబోయే చిత్రం సింగిల్ ట్రైలర్ లో పలు చిత్రాలకు సంబంధించిన రెఫరెన్స్ లను వాడారు. యానిమల్ చిత్రంలోని చివర్లో రణబీర్ కపూర్ చేసే సీన్.. బాలయ్య హనీరోజ్ గురించి మాట్లాడిన మాటలు.. కన్నప్పలో మంచు విష్ణు శివయ్యా అని అరిచే అరుపులు, కమల్ హాసన్ గుణ కేవ్స్ చిత్రంలోని డైలాగ్.. ఇలా చాలా రెఫరెన్స్ లను సినిమాలో వాడారు. అయితే అవన్నీ నార్మల్ యూత్ ను దృష్టిలో పెట్టుకొని హెల్తీ కంటెంట్ ను, కామెడీని జనరేట్ చేసేందుకు మాత్రమే వాడుకున్నామని రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Read more about: sree vishnu manchu vishnu single
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X