ఎర్ర చీరపై మనసు పడ్డ శ్రీకాంత్.. ప్రత్యేక ఆకర్షణతో
బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ఎర్రచీర. సత్య సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ యాక్షన్ సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రంలో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సత్య సుమన్ బాబు మాట్లాడుతూ-ఎర్ర చీరలో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆయన పాత్ర అంతే ఆసక్తికరంగా ఉంటుంది. కథలో ఎంతో కీలకపాత్రను చేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు. ఇక ఈ సినిమాలో శ్రీరాం, అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్ సీన్స్... హారర్, కామెడీ సన్నివేశాలు అబ్బురపరుస్తాయి అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్ మాట్లాడుతూ.. రాజీ లేకుండా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో లీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి మాటలు: గోపీ విమల పుత్ర, కెమెరా: చందు, ఫైట్స్: నందు, కళ: సుభాష్- నాని, కథ-కథనం-దర్శకత్వం: సత్య సుమన్ బాబు.


Click it and Unblock the Notifications











