Srikanth Iyengar: ‘నేనేం రేపిస్ట్ కాదు.. కానీ ఇద్దరు భార్యలు, పిల్లలు వదిలేశారు’
శ్రీకాంత్ అయ్యంగార్.. ఈ పేరు తెలియని తెలుగు సిని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. విలన్ గా, తండ్రిగా, బాబాయ్ గా, మామయ్యగా ఇలా ఎన్నెన్నో సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్లలో నటించాడు. ముఖ్యంగా ఇజం సినిమాతో నటనారంగంలోకి అడుగు పెట్టిన ఇతడు.. అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అద్భుతంగా నటించగలడనే మంచి పేరు సంపాధించాడు. అప్పటి నుంచి వరుసగా అనేక తెలుగు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు.
2016లో కెరియర్ ప్రారంభించిన ఇతడు.. మొదట్లో ఏడాదికి రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటించే వాడు. కానీ 2020 నుంచి ఆయన దశ మారిపోయింది. ఏడాదికి కనీసం ఆరు నుంది పదిహేను వరకు సినిమాల్లో కనిపిస్తున్నారు. 2021లో మొత్తం 12 సినిమాల్లో, 2022లో 10 చిత్రాల్లో ఇక 2023లో అయితే ఏడు సినిమాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రధాన పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్న ఈయన ముందు ముందు మరిన్ని ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు కొట్టేస్తాడనడంలో ఎలాంటి అసంభవమూ లేదు.

ప్రొఫెషనల్ లైఫ్ లో ఇంత సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్న ఈయన.. పర్సనల్ లైఫ్ మాత్రం కష్టాల కడలిలా తోస్తోంది. ఆయన జీవితంలో ఉన్న కష్టాల గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. తాను కాస్త తిక్క మనిషినే అయినా అబద్ధాలు చెప్పడం, నిజాయితీగా లేకపోవడం తన వల్ల కాదని అన్నాడు. అయితే వాళ్లు తప్పు వాళ్లే తన వద్ద నుంచి వెళ్లిపోయారని... వాళ్లేం చేశారో వారికి బాగా తెలుసంటూ వివరించారు. కానీ అప్పటికే బార్యా, పిల్లలతో లైఫ్ చూసిన తనకు ఇప్పుడు చాలా కష్టంగా ఉందని.. ఫ్యామిలీ మాన్ గా బతకాలని ఎవరికైనా ఉంటుందని పేర్కొన్నారు.
తానే సైకోను కాదని, రేపిస్ట్ ను కాదని.. అలాగే శాడిస్ట్ ను కూడా కాదని.. కానీ వాళ్లే తప్పు చేసి తన జీవితం నుంచి వెళ్లిపోవడం తనకు మరింత బాధపడేలా చేస్తుందన్నారు. భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా తనను అర్థం చేసుకోకుండా తల్లి మాటలు విని వెళ్లిపోయారని అన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం.. ఆమె కూడా వేరే వాళ్ల కోసం తనను వదిలేసి వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఇక అప్పటి నుంచి ఒంటరిగానే తాను జీవిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పుడు భార్యా పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసా అని యాంకర్ అడగ్గా.. నన్నే వదిలేసి వెళ్లిపోయిన వాళ్ల గురించి నాకెందుకు అని అంటూనే మరోసారి కన్నీరు కార్చారు శ్రీకాంత్ అయ్యంగార్. అడవిలో తన తమ్ముడు, రెండు కుక్కలతో కలిసి హాయిగా జీవిస్తున్నానని.. తాను చేయాలనుకున్న పనులు అన్నీ చేస్తూ బిజీగా గడపుతున్నానని వివరించారు. తన లైఫ్ లో తనకు ఎలాంటి రీగ్రెట్స్ లేవని చెప్పుకొచ్చారు. సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంటే బాధలేవీ గుర్తుకు రావట్లేదని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











